ETV Bharat / international

ట్రంప్​ కంటే జో బైడెనే ప్రమాదకారి: చైనా - జో బైడెన్

జో బైడెన్​ అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తోంది చైనా. అమెరికా చరిత్రలో అత్యంత బలహీనమైన అధ్యక్షుడిగా బైడెన్​ను అభివర్ణించింది. ఏ సమయంలోనైనా తమతో యుద్ధానికి దిగవచ్చని చైనా చెబుతోంది.

Biden is a very weak President, could start wars: China
బైడెన్​ మాతో యుద్ధానికి దిగుతాడు:చైనా
author img

By

Published : Nov 23, 2020, 2:43 PM IST

అమెరికా ప్రెసిడెంట్​ ఎలక్ట్​ జో బైడెన్..​ అతిబలహీనమైన అధ్యక్షుడని అన్నారు చైనా ప్రభుత్వ సలహాదారు జెంగ్​ యోంగ్​ నియన్. బైడెన్​ అధికారం చేపట్టాక తమ దేశంతో యుద్ధానికి దిగవచ్చని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ దేశం సిద్ధమవ్వాలని వ్యాఖ్యానించారు. అమెరికాతో అనుబంధం పెంచుకోవడానికి దొరికిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు.

"మధురమైన ఆ పాతరోజులు వెళ్లిపోయాయి. అమెరికా చైనాల మధ్య ఎన్నో ఏళ్లుగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. అది ఒక్కరోజులో చల్లారేది కాదు. దీనివల్ల అమెరికన్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బైడెన్​ ఈ సమస్యను పరిష్కరిస్తారని నేను అనుకోవడం లేదు. ఆయనో​ అతి బలహీనమైన అధ్యక్షుడు. తమ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైతే.. చైనాకు వ్యతిరేకంగా ఏమైనా చేయగలరు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు వ్యతిరేకి అయినా.. యుద్ధంపై మాత్రం ఆసక్తి చూపేవారు కాదు. కానీ, డెమొక్రాటిక్​ పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్​.. యుద్ధాన్ని మొదలుపెట్టగలరు."

-- చైనా ప్రభుత్వ సలహాదారు, జెంగ్​ యోంగ్

అమెరికన్​ కాంగ్రెస్​లో చైనాకు వ్యతిరేకంగా రిపబ్లికన్లు, డెమొక్రాట్లు 300లకు పైగా బిల్లులను ప్రవేశపెట్టారు. హాంకాంగ్​, షిన్​జియాంగ్​లో అలజడులను పరిష్కరించేందుకు తీసుకువచ్చిన హాంకాంగ్​ మానవహక్కుల, ప్రజాస్వామ్య చట్టానికి ఇరు పక్షాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో.. బైడెన్​ హయాంలోనూ చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతాయని చైనా విదేశాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి:చంద్రుడి నమూనాల కోసం చైనా కీలక ప్రయోగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.