ETV Bharat / international

చైనాలో కరోనా కలకలం- ఆంక్షలు కట్టుదిట్టం - చైనా కొవిడ్ రూల్స్​

చైనాలో కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో కరోనా(China Corona Update) కేసులు నమోదువుతుండటం వల్ల అక్కడి ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. బీజింగ్​ వాసులు(Beijing Coronavirus Restrictions) నగరాన్ని వీడి వేరే ప్రాంతానికి వెళ్లినట్లైతే.. తిరిగి తమ స్వస్థలానికి చేరుకునే ప్రయాణాలను వాయిదా వేయాలని అధికారులు ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప నగరాన్ని దాటి వెళ్లకూడదని చెప్పారు.

china corona cases
చైనాలో కరోనా కేసులు
author img

By

Published : Nov 2, 2021, 5:00 AM IST

Updated : Nov 2, 2021, 6:48 AM IST

చైనాలో కరోనా(China Corona Update) వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడి కోసం అక్కడి అధికారులు కఠిన ఆంక్షలు(Beijing Coronavirus Restrictions) విధిస్తున్నారు. చైనా రాజధాని బీజింగ్​లో ఎవరైతే నగరాన్ని వీడి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారో... వారు తిరిగి బీజింగ్​కు చేరుకునే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆదేశించారు. కొవిడ్​ కేసులను సున్నా స్థాయికి పరిమితం చేసేందుకు ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

"నగరాన్ని దాటి వివిధ ప్రాంతాల్లో పర్యటించినవారు.. ఆయా ప్రాంతంలో వైరస్ కేసులు వెలుగు చూసినట్లైతే.. తిరిగి నగరానికి రావద్దు. పర్యటనలు పూర్తి చేసుకుని ఇప్పటికే చేరుకున్నవారు.. స్థానిక అధికారులకు తెలియజేయాలి, స్వీయ నిర్బంధంలో ఉండాలి."

-బీజింగ్ హెల్త్ కమిషన్​.

అత్యవసరం అయితే మినహా నగరం దాటి ప్రజలు బయటకు వెళ్లకూడదని బీజింగ్(Beijing Coronavirus Restrictions) అధికారులు తెలిపారు. 16 మున్సిపాలిటీలు, రాష్ట్రాల్లో వైరస్​ పాజిటివ్​ కేసులు(China Corona Update) ఉన్నందున ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రజల ప్రయాణ రికార్డులను పరిశీలించేందుకు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య అధికారులు సమాచారం సేకిరిస్తున్నారు.

గత నెలలో 20 కరోనా కేసులు నమోదు కాగా.. బీజింగ్​లో ఆదివారం స్థానికంగా వ్యాప్తి చెందిన కేసులు(China Corona Update) వెలుగు చూశాయి. నవంబరు 8 నుంచి 11 మధ్య చైనా అధికార పార్టీ- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్​ చైనా(సీపీసీ) బీజింగ్ నగరంలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 375 మందికిపైగా అధికారులు పాల్గొననున్నారు. సీపీసీ నాయకత్వ మార్పు వచ్చేఏడాది జరగనున్న నేపథ్యంలో.. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శీతాకాల ఒలింపిక్స్​ కూడా బీజింగ్​లో జరగనున్నాయి. వందలాది మంది అంతర్జాతీయ క్రీడాకారులు ఈ పోటీలకు హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో... వైరస్ నియంత్రణ కోసం అధికారులు కఠిన చర్యలు(Beijing Coronavirus Restrictions) చేపడుతున్నారు.

"జ్వరం, దగ్గు లేదా ఇతర లక్షణాలు ఉన్నవారు దయచేసి అందరితో కలిసి భోజనాలు చేయకండి. పార్టీల్లో పాల్గొనకండి. దగ్గర్లోని ఆస్పత్రిలో సాధ్యమైనంత త్వరగా వెళ్లండి. మీకు మీరే సొంతంగా మందులను వాడకండి. చికిత్సకు వీలయ్యే సమయాన్ని వాయిదా వేయకండి" అని బీజింగ్​ హెల్త్ కమిషన్​ పేర్కొంది. సోమవారం చైనాలో కొత్తగా 92 కేసులు వెలుగు చూశాయి. అందులో 59 కేసులు స్థానికంగా వ్యాప్తి చెందినవే కావటం గమనార్హం. కరోనా కేసులను సున్నా స్థాయికి పరిమితం చేయాలనే లక్ష్యంతో చైనా ఇప్పటికే.. భారత్ సహ ఇతర దక్షిణాసియా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నిషేధించింది.

ఇవీ చూడండి:

కొవిడ్‌ తర్వాత వేగంగా వ్యాధుల ముసురు.. కారణమిదే...

Corona Death Toll: కరోనా మృత్యుకేళి- 50లక్షలు దాటిన మరణాలు

ఇదీ చూడండి: కొవిడ్ ఆంక్షల అమలుపై షాకింగ్ సర్వే- థర్డ్ వేవ్ తప్పదా?

Last Updated : Nov 2, 2021, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.