పొంగలిలో వెంట్రుక పడిందని భార్యకు విచక్షణారహితంగా బ్లేడుతో గుండు గీశాడు ఓ భర్త. ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని జాయ్పుర్హత్ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది
జాయ్పుర్హత్ జిల్లాలోని ఓ గ్రామంలో బబ్లూ మొండల్ (35) అనే వ్యక్తికి ఉదయాన్నే అల్పాహారంగా పొంగలి వడ్డించింది భార్య. అందులో వెంట్రుక ఉండడాన్ని చూసి బబ్లూ కోపోద్రిక్తుడయ్యాడు. బ్లేడు తీసుకుని భార్యకు గుండు గీశాడు. ఈ విషయంపై గ్రామస్థులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు.
భార్యకు గుండు గీసిన బబ్లూను పోలీసులు అరెస్టు చేశారు. అతడికి 14 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.
ఇదీ చూడండి : శనిగ్రహం చుట్టూ మరో 20 చందమామలు..!