ETV Bharat / international

'ప్రపంచ శాంతే భారత్​, బంగ్లాదేశ్​ ఆకాంక్ష'

బంగ్లాదేశ్​ ఓరకండిలోని హరిచంద్​-గురుచంద్​ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అనంతరం మతువా వర్గం ప్రజలతో సమావేశమయ్యారు. భారత్, బంగ్లాదేశ్ ప్రపంచవ్యాప్తంగా శాంతి, ప్రేమ, స్థిరత్వాలను కోరుకుంటున్నాయని తెలిపారు.

Prime Minister Narendra Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
author img

By

Published : Mar 27, 2021, 1:20 PM IST

భారత్​, బంగ్లాదేశ్​.. ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం, ప్రేమ, శాంతిని కోరుకుంటున్నాయని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బంగ్లాదేశ్​ పర్యటనలో భాగంగా రెండో రోజు మతువా వర్గం ఆధ్యాత్మిక గురువు హరిచంద్​ ఠాకూర్​ జన్మస్థలం ఓరకండిలోని హరిచంద్​-గురుచంద్​ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని. అనంతరం మతువా వర్గం వారితో సమావేశమయ్యారు.

"ఈ అవకాశం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. 2015లో బంగ్లాదేశ్​ వచ్చినప్పుడు ఓరకండికి రావాలనుకున్నా. అది ఇప్పుడు నిజమైంది. ఓరకండికి వచ్చిన తర్వాత.. భారత్​లోని మతువా ప్రజల పొందిన అనుభూతిని నేను అనుభవిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, అస్థిరత, ఆందోళనల స్థానంలో.. స్థిరత్వం, ప్రేమ, శాంతిని భారత్​, బంగ్లా చూడాలనుకుంటున్నాయి. తమ సొంత పురోగతితో ప్రపంచ పురోగతిని కోరుకుంటున్నాయి. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

కరోనా మహమ్మారి సమయంలో భారత్​, బంగ్లాదేశ్​ తమ సామర్థ్యాలను నిరూపించుకున్నాయని తెలిపారు మోదీ. ప్రస్తుతం రెండు దేశాలు కలిసికట్టుగా కొవిడ్​పై పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. భారత్​లో తయారైన వ్యాక్సిన్లు బంగ్లాదేశ్​ పౌరులకు అందించే పనిలో​ ఉన్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.