పౌరసత్వ చట్ట సవరణపై నిరసనల నేపథ్యంలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు సాయంత్రం 5:20 నిమిషాలకు మొమెన్ భారత్‌కు వచ్చి, మూడు రోజుల పాటు పర్యటించాల్సి ఉంది. దిల్లీ వేదికగా జరగాల్సిన వేర్వేరు కార్యక్రమాలు సహా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ద్వైపాక్షిక చర్చల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే... స్వదేశంలో తాను వేర్వేరు కార్యక్రమాలకు హాజరై తీరాల్సి ఉన్నందున భారత పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు అబ్దుల్. జనవరిలో దిల్లీ వచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.