వివాదాస్పద నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతం గురించి అజర్‌బైజాన్, ఆర్మేనియా దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఆర్మేనియా నిర్వహించిన క్షిపణి దాడిలో.. 13 మంది తమ పౌరులు మరణించారని అజర్‌బైజాన్ ఆరోపించింది. సుమారు 50 మంది గాయపడినట్టు పేర్కొంది. గాంజాలో శుక్రవారం జరిగిన ఈ దాడిలో 20 నివాస భవనాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు అజర్‌బైజాన్ అధికారులు. అయితే ఈ ఆరోపణలను ఆర్మేనియా ఖండించింది.
ఆర్మేనియా క్షిపణి దాడులను.. యుద్ధ నేరంగా పరిగణించారు అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇహమ్ అలియోవ్. ఈ దాడికి యుద్ధరంగంలోనే బదులిస్తామని ఆర్మేనియాను హెచ్చరించారు.
నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతం అజర్బైజాన్లో ఉన్నప్పటికీ.. నియంత్రణ మాత్రం ఆర్మేనియా సంప్రదాయ వాదుల చేతుల్లో ఉంది.
ఇవీ చదవండి:
యుద్ధమేఘాలు: ఆర్మేనియా- అజర్‌బైజాన్ వివాదమేంటి ?