ETV Bharat / international

'అజార్​పై నిర్ణయానికి గడువు ఎందుకు?' - china

జైషే మహ్మద్​ అధినేత మసూద్​ అజార్​పై నిర్ణయం తీసుకునేందుకు ఎలాంటి గడువు లేదని చైనా స్పష్టం చేసింది. ఈ నెల 23లోపు అడ్డంకులు తొలగించాలంటూ అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్​ అల్టిమేటం ఇచ్చాయన్న నివేదికలను డ్రాగన్​ దేశం ఖండించింది. అయితే సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

'అజార్​పై నిర్ణయానికి గడువు ఎందుకు?'
author img

By

Published : Apr 18, 2019, 5:26 AM IST

జైషే మహ్మద్​ అధినేత మసూద్​ అజార్​పై చైనా మరోమారు తన వక్రబుద్ధి చూపింది. అజార్​పై నిర్ణయం తీసుకునేందుకు ఎలాంటి గడువు లేదని ప్రకటించింది. ఐరాసలో అజార్​పై ఆంక్షల జాబితాలో చేర్చేందుకు అడ్డంకులను ఈ నెల 23లోపు ఎత్తివేయాలని అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్​ అల్టిమేటం జారీ చేశాయన్న వార్తల్లో నిజం లేదని డ్రాగన్​ దేశం తెలిపింది.

అయితే అజార్​ విషయంలో త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఐరాస భద్రత మండలిలోని 1267 అల్​ఖైదా ఆంక్షల కమిటీ జాబితాలో అజార్​ను చేర్చాలని ఫ్రాన్స్​, బ్రిటన్​, అమెరికా ప్రతిపాదించాయి. దీనికి మరింత సమయం కావాలంటూ చైనా అడ్డుపుల్ల వేసింది. ఈ సమస్య 1267 కమిటీ ఆధ్వర్యంలోనే పరిష్కారం కావాలని చైనా తెలిపింది.

అజార్​పై సాంకేతిక నిలుపుదలను ఈ నెల 23లోపు తొలగించాలని మూడు దేశాలు అల్టిమేటం ఇచ్చాయన్న నివేదికలపై చైనా విదేశాంగ మంత్రి లూకంగ్​ స్పందించారు.

"ఈ సమాచారం ఎక్కడి నుంచి పొందారో అక్కడే మీరు స్పష్టీకరణ చేసుకోవాలి. చైనా వైఖరి స్పష్టంగా చెప్పాం. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకుండా ఎలాంటి చర్యలు సంతృప్తికర ఫలితాలు ఇవ్వవని మేము నమ్ముతున్నాం. అజార్​ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలన్న సమస్యపై చైనా వైఖరి మారదు. మేము సంబంధిత పక్షాలతో సంప్రదింపులు జరుపుతాం. ఈ విషయం పరిష్కారం దిశగా కదులుతోంది. " - లూకంగ్​​, చైనా విదేశాంగ మంత్రి.

అమెరికాపై పరోక్షంగా విమర్శలు చేశారు లూ కాంగ్. ఐరాస భద్రత మండలి సభ్యుల అభిప్రాయాన్ని సంబంధిత దేశం గౌరవిస్తుందని భావిస్తున్నామని తెలిపారు. ఆంక్షల కమిటీ సభ్యుల మధ్య సహకార పద్ధతిలోనే ఈ సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుందన్నారు.

AP Video Delivery Log - 1900 GMT News
Wednesday, 17 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1859: US OH Opioids Report Must credit 'WXIX-TV'/No access Cincinnati/ No access US broadcast networks 4206564
31 doctors charged roles in perscribing opioids
AP-APTN-1859: US NY Pig Brains AP Clients Only 4206565
Scientists restore activity in dead pig brains
AP-APTN-1857: STILLS France Notre Dame Drone Mandatory credit to Gigarama 4206563
STILLS Drone stills of Notre Dame Damage
AP-APTN-1856: US VA Beto ORourke AP Clients Only 4206562
Beto O'Rourke on the campaign trail in Virginia
AP-APTN-1854: Ivory Coast Ivanka Trump Womens Rights AP Clients Only 4206556
ONLYONAP: US First daughter on women's rights
AP-APTN-1851: Venezuela Red Cross Aid AP Clients Only 4206561
Red Cross aid distributed at hospital in Venezuela
AP-APTN-1835: France Notre Dame Organist 2 AP Clients Only 4206560
Notre Dame organist describes 'terrifying' fire
AP-APTN-1823: MidEast Election Result AP Clients Only 4206559
Israeli president nominates Netanyahu as PM
AP-APTN-1817: Ivory Coast Ivanka Trump World Bank AP Clients Only 4206552
ONLYONAP: US First Daughter on World Bank job
AP-APTN-1750: France Notre Dame Meeting 2 AP Clients Only 4206555
Special meeting held on Notre Dame reconstruction
AP-APTN-1723: France Notre Dame Firefighters 2 No access France/EBU 4206553
Paris firefighters: Rose windows in good condition
AP-APTN-1701: US PA Church Fire Test Must credit WPVI; No access Philadelphia 4206550
PA church preps for renovations after Notre Dame
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.