తెలుగు వ్యక్తికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. భారత సంతతికి చెందిన చెన్నుపాటి జగదీశ్ (Chennupati Jagadish).. ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ తదుపరి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన.. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో (ANU professor Chennupati Jagadish) భౌతిక శాస్త్రం పరిశోధకుడిగా కొనసాగుతున్నారు. నానోటెక్నాలజీలో నిష్ణాతులు.
2022 మేలో ఆయన నియామకం అమల్లోకి రానుంది. ఈ బాధ్యతలు చేపట్టనున్న తొలి భారత సంతతి ఆస్ట్రేలియా వ్యక్తి జగదీశే కావడం విశేషం. ఈ అవకాశం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
''రెండేళ్ల పాప, రెండు సంవత్సరాల కాంట్రాక్ట్‌తో.. 31 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని అకాడమీకి వచ్చా. ఇప్పుడు దానికే నేతృత్వం వహిస్తానని అస్సలు అనుకోలేదు.''
- ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్
బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడానికి కృషి చేస్తానని జగదీశ్ (Chennupati Jagadish) స్పష్టం చేశారు. రాబోయే తరం యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం కూడా తన ప్రాధాన్యాంశాలని అన్నారు.
ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్(Chennupati jagadish australia).. దేశంలోని ప్రముఖ సైన్స్ సంస్థల్లో ఒకటి. ఆస్ట్రేలియా పార్లమెంట్‌కు స్వతంత్ర, శాస్త్రీయ సలహాలు ఇస్తుంటుంది.
సైన్స్ అకాడమీని ముందుకు నడిపించేందుకు.. జగదీశ్ సరైన వ్యక్తి అని ప్రశంసించారు ఏఎన్‌యూ వైస్ ఛాన్స్లర్, నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ బ్రెయిన్ స్కిమిట్. ఆయన చేతుల్లో ఉండటమే సురక్షితమని అన్నారు.
ఏళ్లుగా సేవలు..
జగదీశ్.. ఆస్ట్రేలియన్ నేషనల్ వర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేయడమే కాక.. సెమీ కండక్టర్ ఆప్టో ఎలక్ట్రానిక్స్, నానోటెక్నాలజీ విభాగాలకు అధిపతిగా (Chennupati jagadish australia news), ఆస్ట్రేలియన్ నేషనల్ ఫాబ్రికేషన్ ఫెసిలిటికీ డైరెక్టర్‌గానూ సేవలందిస్తున్నారు.
ఆస్ట్రేలియన్ రీసర్చ్ కౌన్సిల్ నుంచి ఆయనకు ఫెడరేషన్ ఫెలోషిప్(2004-09), లేరెట్ ఫెలోషిప్(2009-14) లభించాయి.
జగదీశ్ నేపథ్యం..
జగదీశ్‌ది (Chennupati jagadish news today) ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని వల్లూరు పాలెం అనే మారుమూల గ్రామం. ఆయన నాగార్జున వర్సిటీలో గ్రాడ్యుయేషన్, 1977లో ఆంధ్రా వర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేశారు. 1988లో దిల్లీ వర్సిటీలో పీహెచ్డీ పూర్తిచేసి కొన్నాళ్లు కెనడాలో అధ్యాపకునిగా పనిచేశారు. ఆ తర్వాత 1990లో ఆస్ట్రేలియాకు వెళ్లి ఆప్ట్రో ఎలక్ట్రానిక్స్, నానోటెక్నాలజీ రంగాల్లో పరిశోధన సంస్థను స్థాపించారు.
ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం సందర్భంగా.. 2016లో ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారానికి జగదీశ్‌ను కూడా ఎంపిక చేసింది అక్కడి ప్రభుత్వం.
ఇవీ చూడండి: లేజర్ పుంజాలతో 'నాసా' సరికొత్త ప్రయోగం.. శరవేగంగా కమ్యూనికేషన్
తైక్వాండోలో పుతిన్‌కు దీటుగా ట్రంప్- బ్లాక్ బెల్ట్‌తో నయా రికార్డ్!