2020లోగా 20 లక్షల పిల్లులను చంపేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లులపై ఆ దేశానికి ఇంత ఆగ్రహం ఎందుకని అనుకుంటున్నారా? అయితే చదివేయండి.
పిల్లుల జాతిలో 'ఫెరల్' ఒకటి. ఈ జాతి పిల్లులు ఆస్ట్రేలియాలో అధికం. పెంపుడు పిల్లులకు వీటికి చాలా తేడా ఉంటుంది. ఈ జాతికి చెందిన పిల్లులు మనుషులకు దూరంగా ఉంటాయి.
పిల్లుల ఏరివేతకు కారణం...
ఈ పిల్లుల ఆహారపు అలవాట్లే ఆ దేశ ప్రభుత్వానికి తలనొప్పి తెస్తున్నాయి. వీటి వల్ల అంతరించిపోతున్న 34 జాతుల్లో 22 జాతులకు అపార నష్టం జరుగుతోంది. 2017లో ఆహారం కోసం ఈ పిల్లులు సుమారు 377 మిలియన్ పక్షులు, 649 సరీసృపాలను చంపినట్టు ఓ పత్రిక కథనం వెలువరించింది.
పర్యావరణ వ్యవస్థను ఈ పిల్లులు దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం 2015 - 2020 మధ్య కాలంలో 20 లక్షల ఫెరల్ పిల్లులను చంపడానికి నిశ్చయించింది. ఇందుకు కావాల్సిన ప్రణాళికలూ సిద్ధం చేసింది. తొలి ఏడాది 2 లక్షల 11 వేల పిల్లులను హతమార్చింది.
గతంలో పిల్లులను పట్టుకుని కాల్చి చంపేవారు. కానీ ఇప్పుడు కంగారూ మాంసం, ప్రత్యేక ఔషధాలు, విషంతో కలిపిన తిండి పదార్థాల(సాసేజ్)ను పిల్లులకు అందిస్తున్నారు. దీనికోసం విమానాలను ఉపయోగిస్తున్నారు. ఇవి తిన్న పిల్లులు కేవలం 15 నిమిషాల్లోనే మరణిస్తాయి.
ఇదీ చూడండి: ఐపీఎల్.. స్పిన్నర్లు కాదు పేసర్లదే హవా