ETV Bharat / international

'చైనా ఒత్తిళ్లకు ఆస్ట్రేలియా తలొగ్గదు'

ఆస్ట్రేలియా విధానాలకు సంబంధించిన దాదాపు 14 అంశాలపై ఫిర్యాదు చేస్తూ చైనా అధికారి ఓ జాబితాను విడుదల చేశారు. దీనిపై స్పందించిన ఆస్ట్రేలియా ప్రధాని.. చైనా ఒత్తిళ్లకు భయపడేది లేదని వ్యాఖ్యానించారు.

Scott Morrison
'చైనా ఒత్తిళ్లకు ఆస్ట్రేలియా తలొగ్గదు'
author img

By

Published : Nov 19, 2020, 10:39 PM IST

చైనా తెస్తోన్న ఒత్తిళ్లకు ఆస్ట్రేలియా తలొగ్గదని ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ స్పష్టంచేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలను ఉటంకిస్తూ చైనా అధికారి విడుదల చేసిన జాబితాపై ఆయన‌ ఈ విధంగా స్పందించారు. తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే తమ చట్టాలు ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి ఒత్తిడికి తలొగ్గమని చైనాకు చురుకలంటించారు.

ఆస్ట్రేలియా విధానాలకు సంబంధించిన దాదాపు 14 అంశాలపై ఫిర్యాదు చేస్తూ చైనా అధికారి ఆస్ట్రేలియా మీడియాకు ఓ జాబితాను అందించారు. ఇందులో గత కొన్నిరోజులుగా ఇరుదేశాల మధ్య నెలకొన్న విభేదాలను ప్రస్తావించారు. మీరు చైనాను శత్రువుగా చూస్తే, చైనా శత్రువు అవుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా కఠినమైన చట్టాలు, హువావేపై నిషేధం, ఆస్ట్రేలియాలో చైనా కంపెనీల పెట్టుబడులపై ఆంక్షలను ఆయన ఎత్తిచూపారు. కరోనా విషయంలోనూ అమెరికాకు వంతపాడుతోందని ఆస్ట్రేలియాను విమర్శించారు.

మోరిసన్​ మండిపాటు!

చైనా అధికారి వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌ స్పందించారు. ఇది చైనా రాయబార కార్యాలయం నుంచి వచ్చిన అనధికార పత్రమన్న ఆయన‌, తమ జాతి ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్న చట్టాలు, విధానాల రూపకల్పనలను ఎవరూ అడ్డుకోలేరని తిప్పికొట్టారు. ఇక ఈ విషయంపై అమెరికా కూడా స్పందించింది. ఆస్ట్రేలియా తీసుకుంటున్న చర్యలపై బీజింగ్‌ కలత చెందిందని వైట్‌హౌస్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ పేర్కొంది. ఇటువంటి చర్యలు తీసుకోవడంలో ఆస్ట్రేలియాను అనుసరించే దేశాల సంఖ్య మరింత పెరగనుందని అభిప్రాయపడింది.

ఇదీ చదవండి:భారత్​ ఎదుగుదలను చూసి చైనా భయపడుతోందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.