ఆస్ట్రేలియాలో 3 రోజులుగా కార్చిచ్చు చెలరేగుతోంది. ప్రాణ భయంతో వందలాది మంది ప్రజలు బలవంతంగా తమ ప్రాంతాలను ఖాళీ చెయ్యాల్సి వచ్చింది. మంటలు వ్యాపించి చాలా ఇళ్లు బూడిదయ్యాయి.
క్వీన్స్లాండ్ రాష్ట్రంలో కార్చిచ్చు ప్రభావంతో ఎంతో ఆస్తి నష్టం వాటిల్లింది. దాదాపు 300 మంది నిరాశ్రయులయ్యారు. స్టాన్తోర్ప్, వార్విక్ ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
భయంకరమైన కార్చిచ్చు అదుపులోకి రావడానికి మరో వారం రోజులు పడుతుందని అధికారులు తెలిపారు. బలమైన గాలులు వీచడం, గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటమే దీనికి కారణంగా పేర్కొన్నారు.
ఇదీ చూడండి:బొమ్మకోసం 2 ఊళ్ల గొడవ.. నల్ల రంగుతో దాడులు