ETV Bharat / international

'వార్తా సంస్థలకు గూగుల్, ఫేస్​బుక్​ డబ్బు చెల్లించాల్సిందే'

సంప్రదాయ మీడియా సంస్థల వార్తల్ని తమ వెబ్​సైట్ల ద్వారా వినియోగదారులకు చేరవేస్తూ కోట్లు గడిస్తున్న గూగుల్​, ఫేస్​బుక్​ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. వార్తా సంస్థలకు ఇక ఆ టెక్​ సంస్థలు పరిహారం చెల్లించడాన్ని తప్పనిసరి చేసింది.

author img

By

Published : Apr 20, 2020, 11:57 AM IST

Aus to make Google, Facebook pay for news content
'వార్తల ప్రసారం కోసం గూగుల్, ఫేస్ బుక్ లు పరిహారం చెల్లించాల్సిందే'

వార్తల ప్రసారం కోసం దిగ్గజ సెర్చ్ఇంజన్ గూగుల్, సామాజిక మాధ్యమం ఫేస్​బుక్​... మీడియా సంస్థలకు పరిహారం చెల్లించడాన్ని తప్పనిసరి చేయనుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. కరోనా మహమ్మారి కారణంగా ప్రకటనల ద్వారా వచ్చే రాబడి తగ్గి... మీడియా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన నిబంధనల ముసాయిదాను ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్(ఏసీసీసీ) జులై చివరలో విడుదల చేయనుంది. ఈ మేరకు ఆ దేశ కోశాధికారి జోష్ ఫ్రైడెన్‌బర్గ్ వెల్లడించారు.

ఆస్ట్రేలియా విజయం సాధిస్తుంది!

వార్తా సంస్థలకు పరిహారం చెల్లించేలా గూగుల్​, ఫేస్​బుక్​ను ఒప్పించడంలో ఫ్రాన్, స్పెయిన్, వంటి ఇతర దేశాలు విఫలమైనప్పటికీ ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు ఫ్రైడెన్​బర్గ్. ఆయా సంస్థల ఒత్తిళ్లకు తలొగ్గమని, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనడానికైనా సిద్ధమని స్పష్టంచేశారు.

మీడియా సంస్థలకు పరిహారం చెల్లింపుపై నిబంధనలకు సంబంధించి భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది గూగుల్.

ఇదీ చూడండి: ఇల్లంతా ఇట్టే శుభ్రపరిచే పిచికారీ.. రోబో!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.