ETV Bharat / international

Afghan Attack: కాబుల్​లో కాల్పుల మోత- కొత్త గ్యాంగ్​ ఎంట్రీనా? - Firing at Kabul Airport

అఫ్గాన్​లో ఎక్కడ చూసిన తాలిబన్లే(Afghanistan Taliban). ఏ ప్రాంతంలో తూటా పేలిన వారి పనే అని యావత్​ ప్రపంచం భావిస్తుంది. సోమవారం కాబుల్​ విమానాశ్రయం వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అయితే.. ఆ కాల్పులు చేసింది తాలిబన్లేనా? లేక మరో కొత్త గ్యాంగ్​ వచ్చిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Attackers kill Afghan soldier
కాబుల్​ ఎయిర్​పోర్ట్​పై కాల్పులు
author img

By

Published : Aug 23, 2021, 12:42 PM IST

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు(Afghanistan Taliban) హస్తగతం చేసుకున్న తర్వాత ఆ దేశంలో తూటాల వర్షం కురుస్తోంది. సోమవారం తెల్లవారుజామున కాబుల్​ విమానాశ్రయం ఉత్తర ద్వారం వద్ద అఫ్గాన్​ బలగాలు, గుర్తు తెలియని దుండగుల మధ్య కాల్పులు జరిగినట్లు జర్మనీ మిలిటరీ తెలిపింది. ఈ కాల్పుల్లో అఫ్గాన్​ భద్రతా దళానికి చెందిన ఓ అధికారి ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది.

విమానాశ్రయం వద్ద కాల్పులు జరిగిన క్రమంలో అమెరికా, జర్మనీ బలగాలు తిప్పికొట్టే ప్రయత్నం చేశాయని, అయితే.. జర్మనీ సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది ఆ దేశ ఆర్మీ. కాల్పులు ఎవరు జరిపారనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదని పేర్కొంది. కాబుల్​ ఎయిర్​పోర్ట్​ బయట తాలిబన్లు ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు నాటో, అఫ్గాన్​ దళాలపై కాల్పులు జరపలేదని తెలిపింది.

కాబుల్​ విమానాశ్రయానికి(Kabul airport) ప్రజలు భారీగా వస్తున్న క్రమంలో కాల్పులు జరగగా.. తొక్కిసలాట జరిగి ఆదివారం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ దేశం నుంచి పారిపోయేందుకు వేలాది మంది ఎయిర్​పోర్టుకు తరలివస్తున్నారు.

ఇదీ చూడండి: Panjshir valley: 'పంజ్​షేర్'​ తాలిబన్లకు లొంగుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.