ETV Bharat / international

ISIS Kabul Attack: 'ఐసిస్​-కే'లో 14 మంది కేరళవాసులు- తాలిబన్ల దయతో... - అఫ్గానిస్థాన్​ ఉగ్రసంస్థలు

కాబుల్​ విమానాశ్రయం వద్ద దాడితో(Kabul airport blast) సర్వత్రా చర్చనీయాంశమైంది ఐసిస్​-కే ఉగ్రసంస్థ(ISKP terrorist group). మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఐసిస్​-కే ఉగ్ర ముఠాలో 14 మంది కేరళకు చెందినవారు ఉన్నట్లు సమాచారం. జైళ్లలో ఉన్నవారందరినీ తాలిబన్లు ఇటీవలే విడుదల చేసినట్లు తెలిసింది.

Islamic State of Khorasan Province
ఐసిస్​-కే ముఠా
author img

By

Published : Aug 28, 2021, 1:45 PM IST

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడులకు(Kabul airport blast) పాల్పడి.. 200 మందికిపైగా ప్రాణాలను పొట్టనపెట్టుకుంది ఐసిస్​-కే ఉగ్రసంస్థ(islamic state khorasan). ఆ ముష్కర మూక దెబ్బకు.. కాబుల్​లో నిత్యం ఏం జరుగుతుందోనని యావత్​ ప్రపంచం ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే ఐసీస్​-కే ఉగ్రముఠాలో(ISKP terrorist group) 14 మంది కేరళకు చెందిన వారు ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇటీవల పలు జైళ్లలోని ఉగ్రవాదులను తాలిబన్లు విడుదల చేశారు. బగ్రామ్​ జైలు​ నుంచి విడుదల చేసిన తర్వాత వారంతా ఐసిస్​-కే సంస్థతో కలిసినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు కేరళలోని తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు సమాచారం.

ఇస్లామిక్​ స్టేట్​ ఆఫ్​ సిరియాగా చెప్పుకునే ఈ ఉగ్రసంస్థ 2014లో ఇరాక్​లోని మోసుల్​ను ఆక్రమించింది. ఆ తర్వాత కేరళలోని మలప్పురమ్​, కాసరగాడ్​, కన్నూర్​ జిల్లాల నుంచి కొన్ని బృందాలు భారత్​ నుంచి వెళ్లి పశ్చిమాసియాలోని జిహాదీలతో కలిసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అందులోని కొన్ని కుటుంబాలు అఫ్గానిస్థాన్​లోని నంగర్​హార్​ ప్రావిన్స్​కు వచ్చి ఐసిస్​-కేలో చేరినట్లు తెలిసింది.

ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులైన కేరళవాసులతో అఫ్గాన్​లో దాడులు చేపట్టి భారత్​ పేరును తాలిబన్లు, ఇతర ముఠాలు నాశనం చేసే అవకాశం ఉందని భారత్​ ఆందోళన చెందుతోంది.

ఇదీ చూడండి: ఐసిస్‌తో చేతులు కలిపిన హైదరాబాద్‌ వాసి

ISIS Kabul Attack: ఏంటీ ఐసిస్​-కే? తాలిబన్లకు శత్రువా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.