తూర్పు అఫ్గానిస్థాన్‌లో దాడికి తెగించింది తాలిబన్ ఉగ్రసంస్థ. ఘాంజీ నగరంలో భారీ కారు బాంబు పేలుడుకు పాల్పడింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మరో 179 మంది స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు తామే చేసినట్లు తాలిబన్ ప్రకటించుకుంది.
18 ఏళ్లుగా అఫ్గానిస్థాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న అమెరికా దళాలు అఫ్గాన్‌ను వదిలి వెళ్లాలనే అంశంపై డోహాలో చర్చలు సాగుతున్నాయి. అమెరికా, అఫ్గానిస్థాన్‌తో పాటు తాలిబన్ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ తరుణంలో కారుబాంబు దాడి పరిణామాలు ఎలా ఉంటాయో అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి.
ఇదీ చూడండి: హైదరాబాద్ వర్సిటీకి ర్యాంక్ మిస్సైంది అందుకే...