ETV Bharat / international

అతిపెద్ద వాణిజ్య కూటమికి చైనా సహా 14 దేశాలు రెడీ

author img

By

Published : Nov 15, 2020, 12:48 PM IST

ఆర్​సెప్ దేశాలు అతిపెద్ద వాణిజ్య ఒప్పందానికి ఆమోదం తెలిపాయి. చైనా సహా 14 దేశాలు ఈ ఒప్పందంపై ఆదివారం వర్చువల్​గా సంతకాలు చేయనున్నాయి. ఈ ఒప్పందం తమ దేశాలను కరోనా కష్టాల నుంచి గట్టెక్కిస్తుందని సభ్య దేశాలు భావిస్తున్నాయి.

biggest trade pact between RCEP countries
ఆర్​సెప్ దేశాల అతిపెద్ద వాణిజ్య ఒప్పందం

ప్రపంచంలో అతిపెద్ద వాణిజ్య కూటమి ఏర్పాటుకు చైనా సహా 14 దేశాలు అంగీకారం తెలిపాయి. ఆగ్నేయాసియ దేశాల 10వ నేషనల్ అసోసియేషన్ వార్షిక సదస్సు(ఏఎస్​ఈఏఎన్​) విరామంలో.. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్​సెప్) దేశాలు ఈ ఒప్పందంపై ఆదివారం వర్చువల్​గా సంతకాలు చేయనున్నాయి.

కరోనా సంక్షోభం నుంచి రికవరీకి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాయి ఆర్​సెప్ దేశాలు.

ఎనిమిదేళ్ల సుధీర్ఘ చర్చల తర్వాత ఎంతో కష్టపడి.. చివరకి ఒప్పందం వరకు వచ్చామని మలేసియా వాణిజ్య మంత్రి మహమ్మద్ అజ్మిన్​ అలీ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రక్షణాత్మక విధానాలు పాటించకుడా ఆర్​సెప్ దేశాలు తమ మార్కెట్లను తెరిచాయని తెలిపారు.

ఈ ఒప్పందతో సభ్య దేశాల మధ్య ఇప్పటికే తక్కువగా ఉన్న టారీఫ్​లు రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతాయని తెలిపారు.

ఇదీ చూడండి:బైడెన్ రాకతో ద్వైపాక్షిక వాణిజ్య బంధం బలపడేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.