ETV Bharat / international

బంగ్లాదేశ్​ పర్యటనలో భారత ఆర్మీ చీఫ్​ - బంగ్లా పర్యటనలో భారత ఆర్మీ చీఫ్​

భారత ఆర్మీ చీఫ్​ ఎంఎం​ నరవాణే.. ఐదు రోజుల బంగ్లాదేశ్​ పర్యటనలో గురువారం అక్కడికి చేరుకున్నారు. అనంతరం.. ఆ దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు. ఇరు దేశాల మధ్య సహాయ, సహకారాల్ని మరింత విస్తరించడం, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా.. ఏప్రిల్​ 8 నుంచి 12 వరకు ఈ పర్యటన సాగనుంది.

Army Chief General Naravane to meet Bangladesh's three service chiefs during in Bangladesh visit
బంగ్లాదేశ్​ పర్యటనలో భారత ఆర్మీ చీఫ్​
author img

By

Published : Apr 8, 2021, 12:40 PM IST

Updated : Apr 8, 2021, 1:42 PM IST

భారత​ సైన్యాధినేత మనోజ్​ ముకుంద్​ నరవాణే.. 5 రోజుల పర్యటన కోసం బంగ్లాదేశ్​కు చేరుకున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా.. 1971 స్వాతంత్రోద్యమంలో అమరులైన సైనికులకు శిఖా అనిర్బన్​ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం.. సేన్​కుంజ్​ వద్ద గార్డ్​ ఆఫ్​ హానర్​ అవార్డు అందుకున్నారు నరవాణే.

భారత్​, బంగ్లాదేశ్​ల వ్యూహాత్మక సమస్యలు సహా ఇరు దేశాల మధ్య సహకారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా.. ఏప్రిల్​ 8 నుంచి 12 వరకు నరవాణే పర్యటన కొనసాగనుంది. రెండు దేశాల సైన్యాల మధ్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లేలా సైన్యాధినేత చర్చలు జరపనున్నారని ఆర్మీ ప్రతినిధి కర్నల్​ అమన్​ ఆనంద్​ తెలిపారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లా పర్యటన ముగిసిన రెండు వారాలకే.. నరవాణే అక్కడ పర్యటన చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది.

రెండో రోజు పర్యటనలో భాగంగా.. ఆ దేశ త్రివిధ దళాల ప్రముఖులతో సమావేశం కానున్నారు నరవాణే.

ఈనెల 11న ఆ దేశ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్​ మొమెన్​తోనూ ఆయన భేటీ కానున్నారు.

చివరి రోజు(ఈ నెల 12న) పర్యటనలో భాగంగా.. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాల కమాండర్లు, భూటాన్​ ఆర్మీ చీఫ్​ ఆపరేషన్స్​ అధికారితోనూ నరవాణే సమావేశం కానున్నారని ఆనంద్ తెలిపారు.

ఇదీ చదవండి:ఉత్తరాఖండ్​ను కమ్మేసిన మంచు- ప్రజల ఇక్కట్లు

Last Updated : Apr 8, 2021, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.