ETV Bharat / international

ఇన్​స్టా​లో సూపర్ స్టార్​లు ఈ 7 శునకాలు! - dogs in instagram news

శునకాలు తోక ఊపుకుంటూ మనుషుల చుట్టూ తిరుగుతూ... సామాజిక మాధ్యమాల్లో మనల్ని వాటి చుట్టూ తిప్పుకుంటున్నాయి. అవును, అమాయకమైన వదనాలు, కల్మషం లేని హృదయాలతో... ఇన్​స్టాగ్రామ్​లో చెలరేగిపోతున్నాయి. మరి కోట్లాది మంది అభిమానుల మనసులు కొల్లగొట్టిన ఆ ఏడు కుక్కలు ఏవో చూసేద్దాం రండి...

Are You Following These 7 Dogs On Instagram? Here's Why You Should
ఇన్​స్టా​లో ఈ ఏడు కుక్కలను ఫాలో అవుతున్నారా?
author img

By

Published : Jun 20, 2020, 9:16 AM IST

ఒక్కసారి ప్రేమగా పలకరిస్తే చాలు... మనుషులను మనుషలకంటే ఎక్కువగా ప్రేమించేస్తాయి శునకాలు. అందుకే, మానవాళి ఎప్పుడో శునకాల ప్రేమకు దాసోహమైపోయింది. సామాజిక మాధ్యమాల్లో శునకాల వీడియోలకు వచ్చే లైకులే ఇందుకు నిదర్శనం. పైగా ముద్దొచ్చే జంతువుల వీడియోలు చూడడం వల్ల ఎంతటి ఒత్తిడైనా ఇట్టే దూరమవుతుందని పరిశోధనల్లో తేలింది. అందుకే, ఓ ఏడు శునకాలు ఇన్​స్టాలో తెగ సందడి చేస్తున్నాయి.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని, సెలబ్రిటీలుగా మారిపోయాయి. ఆ సెలబ్రిటీ కుక్కలివే...

  • రికార్డుల పుట్ట.. జిఫ్​

ముద్దు ముద్దు హావభావాలతో... వీక్షకుల మదిని దోచిన జిఫ్​కు దాదాపు కోటికి పైగా ఫాలోవర్లున్నారు. అన్ని శునకాల్లా నాలుగు పాదాలపై కాకుండా.. కేవలం రెండు కాళ్లతో చకచకా చెప్పిన పని చేయడం జిఫ్​ ప్రత్యేకత. పోమెరానియన్ జాతికి చెందిన జిఫ్​ తన అందం, ప్రతిభతో ఇప్పటికే రెండు గిన్నిస్​ వరల్డ్​ రికార్డులు తన ఖాతాలో వేసుకుంది.

  • నిజాయితీ గల టక్కర్​​

గోల్డెన్​ రిట్రీవర్ టక్కర్ వినయం, విధేయత మాత్రమే కాదు.. టన్నుల కొద్దీ నిజాయితీ, హుందాతనానికి మారుపేరు. 25 లక్షల మంది ఫాలోవర్లున్న టక్కర్​.. తన ముందు ఆహారం పెట్టి ముట్టుకోవద్దంటే.. యజమాని మాటకు విలువిచ్చి ఎంత నోరూరినా నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోదు. అందుకే, సామాజిక మాధ్యమాల్లో టక్కర్​ పేరు మారుమోగుతోంది.

  • మాయ మహా తెలివైందే!

పోలార్​ బేర్​ సంతతికి చెందిన మాయ ఎంతో తెలివైంది. తన మేధస్సుతో 20 లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది.

  • మారుతో.. నవ్వుతో పడేసింది!

జపాన్ టోక్యోకు చెందిన మారుతో నవ్వు ముఖాన్ని చూస్తే సగం బాధలు తీరిపోయిన భావన కలుగుతుంది. 2011లో జపాన్​లో సంభవించిన భీకర భూకంపం తర్వాత.. ఆ దేశంలో జనం బిక్కుబిక్కుమంటున్న సమయంలో యజమాని షింజ్రో ఓనో.. మారుతో ప్రశాంతమైన ముఖాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టాడు. ఇప్పుడు ఇన్​స్టాలో దాదాపు 26 లక్షల మంది... షిబ ఇనూ జాతికి చెందిన మారుతో చిరునవ్వును రోజూ చూస్తున్నారు.

  • అల్లరి చార్లీ

శునకాల అల్లరంటే మీకిష్టమైతే.. కచ్చితంగా చార్లీ అకౌంట్​ను ఫాలో అవ్వాల్సిందే! తన సోదరుడితో నిత్యం దెబ్బలాడుతూ.. అందరినీ ఆకట్టుకుంటోంది చార్లీ. గోల్డెన్​ రిట్రీవర్​ బ్రీడ్​కు చెందిన చార్లీ... వీడియోలు అత్యధికంగా షేర్​ అవుతున్నాయి.

  • మా మంచి రేలన్..

రేలన్​ మంచితనానికి మారు పేరు. పిల్లి పిల్లలను ఎంతో ప్రేమగా చేరదీస్తూ.. నెటిజన్ల హృదయాలు దోచేసింది.

  • సీక్రెట్​ టాలెంట్​!

ఆస్ట్రేలియన్​ షెపర్డ్​ జాతికి చెందిన సీక్రెట్​ అసాధారణ ప్రతిభకు నిదర్శనం. సీక్రెట్​ డ్యాన్స్​ చేస్తుంది, బొమ్మలు గీస్తుంది, డ్రమ్స్​ వాయించి సంగీతాన్ని సృష్టిస్తుంది. అందుకే, ఐదేళ్ల వయసులోనూ సోషల్​ మీడియాలో దుమ్మురేపుతోంది.

ఇంకెందుకు ఆలస్యం... శునకాల అల్లరి, ప్రతిభలను చూసి వినోదం పొందాలంటే వెంటనే ఇస్టాలో ఈ ఏడు సెలబ్రిటీ శునకాలను ఫాలో అయిపోండి.

ఇదీ చదవండి:ఆ కుక్కలకు యజమానుల నుంచే కరోనా సోకింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.