ETV Bharat / international

'మతిస్థిమితం లేని జడ్జి వల్లే ముషారఫ్​కు ఉరిశిక్ష'​ - Pak govt wants removal of mentally unfit judge

పర్వేజ్ ముషారఫ్​కు​ మరణశిక్ష విధిస్తూ పెషావర్​​ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై పాక్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మతిస్థిమితం లేని ఆ న్యాయమూర్తి'ని వెంటనే తొలగించాలని నిర్ణయించింది. ఇందుకోసం సుప్రీంకోర్టు జ్యుడీషియల్​ కౌన్సిల్​ను ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఉరిశిక్ష తీర్పుపై అప్పీల్ కూడా చేయాలని నిర్ణయించింది.

Angry over Musharraf verdict, Pak govt wants removal of 'mentally unfit' judge
ముషారఫ్​కు ఉరిశిక్ష వేసిన జడ్జిని తొలగించాలి : పాక్​
author img

By

Published : Dec 20, 2019, 5:29 AM IST

Updated : Dec 20, 2019, 3:20 PM IST

'మతిస్థిమితం లేని జడ్జి వల్లే ముషారఫ్​కు ఉరిశిక్ష'​

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, జనరల్​ (రిటైర్డ్​) పర్వేజ్​ ముషారఫ్​కు మరణశిక్ష విధిస్తూ పెషావర్​​ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఇమ్రాన్​ఖాన్​ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మతిస్థిమితం లేని న్యాయమూర్తిని' తొలగించాల్సిందిగా సుప్రీం జ్యుడీషియల్​ కౌన్సిల్​ను కోరనున్నట్లు తెలిపింది. అలాగే ఉరిశిక్ష తీర్పుపై అప్పీల్​ చేయాలని కూడా పాక్ ప్రభుత్వం నిర్ణయించింది.

శవాన్ని ఉరితీయండి

ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనానికి పెషావర్ హైకోర్టు చీఫ్​ జస్టిస్​ వకార్ అహ్మద్​ సేథ్​ నేతృత్వం వహించారు. ముషారఫ్​కు మరణశిక్ష విధిస్తూ 167 పేజీల వివరణాత్మక తీర్పునిచ్చారు.

"పారిపోయిన దోషిని (ముషారఫ్​) పట్టుకొని, చట్ట ప్రకారం శిక్షపడేలా చేయాలి. ఒక వేళ ఉరిశిక్ష అమలు కంటే ముందే ముషారఫ్​ చనిపోతే.. అతని శవాన్ని పార్లమెంట్​కు ఈడ్చుకొచ్చి మూడు రోజులపాటు ఉరితీయాలి"- జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్​, ప్రత్యేక కోర్టు ప్రధానన్యాయమూర్తి

పాక్ చట్టాలకు విరుద్ధం

ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపై ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ తన న్యాయబృందంతో సంప్రదించారు. తరువాత న్యాయమంత్రి ఫరోగ్​ నసీమ్​ మాట్లాడుతూ.. ప్రత్యేక న్యాయస్థానం తీర్పు పాక్​ చట్టాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ తీర్పు వెలువరించిన న్యాయమూర్తికి 'మతిస్థిమితం లేదని', వెంటనే అతనిని పదవి నుంచి తొలగించాలని సుప్రీం జ్యుడీషియల్​ కౌన్సిల్​కు నివేదించనున్నట్లు ప్రకటించారు.

పాకిస్థాన్​లో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించగలిగే ఏకైక సంస్థ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్​.

ముషారఫ్​కు బాసటగా పాక్​ సైన్యం

ముషారఫ్​కు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అంతకు ముందు పాక్ సైన్యం కూడా ఖండించింది. ఈ తీర్పు మానవత్వం, మత, నాగరిక, నైతిక విలువలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది.

వ్యక్తిగత కక్షతోనే..

ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపై స్పందించిన ముషారఫ్​.. ఇది కొంత మంది వ్యక్తిగత ద్వేషంతో ఇచ్చిన తీర్పుగా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ప్రతీకారం తీర్చుకుంటాం'- నిరసనకారులకు యోగీ హెచ్చరిక

RESTRICTION SUMMARY: KOMO - MUST CREDIT KOMONEWS.COM; NO ACCESS SEATTLE; NO USE US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE  
SHOTLIST:
KOMO - MUST CREDIT KOMONEWS.COM; NO ACCESS SEATTLE; NO USE US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE  
Seattle - 18 December 2019
++STATION GRAPHIC AS INCOMING++
1. Wide view of truck and train after collision
2. Medium view of damaged power line pole and locomotive
3. Close view of damaged power pole and power lines
4. Close view of truck trailer and locomotive
5. Wide view of train
6. Close view of truck trailer and locomotive
7. Wide view of truck trailer and locomotive
8. Medium view of power pole and locomotive
STORYLINE:
Emergency crews responded to a collision between a train and a package delivery truck near a Seattle neighborhood Wednesday evening.
According to the Seattle Fire Department, a train and a UPS truck collided sometime around 8 p.m. The fire department reports that they hit each other at low speed.
A power pole got caught in the middle of the incident, however. Power lines were down in the area of the collision.
The driver of the truck was able to get out and away from the vehicle and the train engineer was also able to get off of the train, according to a report from KOMO News.  No injuries were reported.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 20, 2019, 3:20 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.