ETV Bharat / international

'పాక్ సైన్యం చేతిలో ఇమ్రాన్ ఖాన్​ కీలుబొమ్మ' - కాంగ్రెస్

పాకిస్థాన్​లో పేరుకు ప్రభుత్వమున్నా ఆధిపత్యమంతా సైన్యానిదేనని అమెరికా కాంగ్రెస్​ నివేదిక తేల్చింది. సైన్యం చేతిలో పాక్ ప్రధాని కీలుబొమ్మ అంటూ వ్యాఖ్యానించింది.

'పాక్ సైన్యం చేతిలో ఇమ్రాన్ కీలుబొమ్మ'
author img

By

Published : Aug 29, 2019, 7:18 PM IST

Updated : Sep 28, 2019, 6:43 PM IST

పాకిస్థాన్​లో ప్రజా ప్రభుత్వం ఉన్నా.. అసలు పెత్తనమంతా సైన్యానిదేనని అమెరికా కాంగ్రెస్​ నివేదిక సీఆర్​ఆర్​ తెలిపింది. ​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ నేతృత్వంలో పాక్​ విదేశాంగ విధానం, భద్రతా విధానాలన్నింటినీ సైన్యం తీవ్రంగా ప్రభావితం చేస్తోందని పేర్కొంది.

అధికారంలోకి రావడానికి ముందు ఇమ్రాన్​కు ఎలాంటి పాలనా అనుభవం లేదని.. అయితే, అప్పటి ప్రధాని నవాజ్​ షరీఫ్​ అధికారంలో నుంచి దించాలనే ఏకైక దురుద్దేశంతో ఎన్నికల సమయంలో పాక్​ సైన్యం దేశ రాజకీయాలను తారుమారు చేసిందని సీఆర్ఎస్ స్పష్టంచేసింది.
ఇమ్రాన్​ సారథ్యంలోని 'తెహ్రీక్ ఇ ఇన్సాఫ్'​ పార్టీ నయా పాకిస్థాన్ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగి చాలా మంది ఓటర్లను ఆకర్షితుల్ని చేసిందని...అయితే అవేమీ సాకారం కావడం లేదని నివేదిక వెల్లడించింది.

సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమని చెప్పినప్పటికీ ఆ దిశగా ఇమ్రాన్​ ప్రయత్నాలేమీ చేయడంలేదని.. ఆయన సైన్యం చేతుల్లో కీలుబొమ్మలా మారిపోయారని సీఆర్​ఆర్ నివేదిక తెలిపింది. అమెరికాకు చెందిన స్వతంత్ర పరిశోధనా విభాగం సీఆర్ఆర్​. అమెరికా చట్ట సభ్యులకు పలు అంశాలపై అవసరమైన నివేదికలు రూపొందిస్తుంటుంది.

ఇదీ చూడండి: చిదంబరం పిటిషన్​పై సెప్టెంబర్​ 5న నిర్ణయం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 28, 2019, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.