ETV Bharat / international

'టీకా అందించిన భారత్​కు ధన్యవాదాలు' - అఫ్గానిస్థాన్​కు 5 లక్షల వ్యాక్సిన్ డోసులు అందించిన భారత్​

తమ దేశానికి 5 లక్షల కరోనా వ్యాక్సిన్​ డోసులను అందించినందుకు అఫ్గానిస్థాన్ ప్రభుత్వం భారత్​కు ధన్యవాదాలు తెలిపింది. కష్టకాలంలో భారత్.. తమను ఆదుకుందని, ఇది ఆ దేశ ​ఔదార్యానికి, నిబద్ధతకు నిదర్శనమని కొనియాడింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడేందుకు ఇది దోహదపడుతుందని స్పష్టం చేసింది.

Afghanistan thanks India for sending 5 lakh coronavirus vaccine doses
కష్ట కాలంలో ఆదుకున్న భారత్​కు ధన్యవాదాలు: అఫ్గానిస్థాన్​
author img

By

Published : Feb 8, 2021, 5:15 AM IST

తమ దేశానికి 5లక్షల కరోనా వ్యాక్సిన్​ డోసులు పంపించినందుకు భారత్​కు ధన్యవాదాలు తెలిపింది అఫ్గానిస్థాన్. ఇది భారత్ నిబద్ధత, ఔదార్యానికి నిదర్శనమని కొనియాడింది. కష్టకాలంలో తమను ఆదుకున్నందుకు భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అఫ్గాన్​ విదేశాంగ మంత్రి మహమ్మద్​ హనీఫ్​ ఆత్మర్.

అఫ్గాన్​కు టీకాలను పంపించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. టీకా డోసులు ఆదివారం ఆ దేశంలో అడుగుపెట్టాయి. అంతకుముందు దాదాపు 20మెట్రిక్​ టన్నుల వైద్య సామాగ్రిని అఫ్గానిస్థాన్​కు పంపింది భారత ప్రభుత్వం.

కొవిడ్-19 టీకాను భారత్ సరిహద్దు దేశాలైన భూటాన్​, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్​, మయన్మార్, శ్రీలంక, సియచిల్లెస్​, అఫ్గానిస్థాన్​, మారిషస్​లకు అందిస్తామని ​జనవరి 19న భారత ప్రభుత్వం ప్రకటించింది.

ఇదీ చదవండి : మాకు కరోనా టీకా అవసరం లేదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.