ETV Bharat / international

'అమెరికా తొందరపడింది.. అందుకే అఫ్గాన్‌లో హింస' - అఫ్గాన్​లో పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణ

అఫ్గాన్​లో హింసకు కారణం అగ్రరాజ్యమైన అమెరికా తన సేనలను ఉపసంహరించుకోవడమే అని ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్​ ఘని అన్నారు.

Ashraf Ghani
అష్రఫ్​ ఘని
author img

By

Published : Aug 3, 2021, 6:14 AM IST

Updated : Aug 3, 2021, 6:22 AM IST

అమెరికా తన సేనలను వేగంగా ఉపసంహరించుకోవడమే అఫ్గాన్‌లో హింసకు కారణమని ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని అన్నారు. సెప్టెంబర్‌ 11లోపు అఫ్గాన్‌ నుంచి తమ సేనలు వైదొలగుతాయని కొన్నాళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. అయితే ఈ ఉపసంహరణ ప్రక్రియ చాలా వేగంగా సాగింది. దీంతో తాలిబన్లు దూకుడు పెంచారు. చాలా ప్రావిన్స్‌ల్లో జిల్లాలను ఆక్రమించుకున్నారు.

ఈ నేపథ్యంలో అఫ్గాన్‌ పార్లమెంటులో ఘని మాట్లాడుతూ.. తాలిబన్లతో సయోధ్య కుదుర్చుకోవాలంటూ అమెరికా తెచ్చిన శాంతి ప్రక్రియను తొందరపాటు చర్యగా అభివర్ణించారు. ఇది శాంతిని సాధించడంలో విఫలమైందని, దేశంలో గందరగోళాన్ని సృష్టించిందని పేర్కొన్నారు.

జిల్లాలకు జిల్లాలు తాలిబన్లు ఆక్రమిస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో తమ తఢాఖా చూపిస్తామని ఘని తెలిపారు. అయితే తాలిబన్లను ప్రభుత్వ దళాలు ఎలా నిలువరిస్తాయన్న విషయాన్ని మాత్రం వివరించలేదు.

ఇదీ చూడండి: 'లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరం'

Last Updated : Aug 3, 2021, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.