ETV Bharat / international

అఫ్గాన్​లో వరుస పేలుళ్లు- ఐదుగురు మృతి

అఫ్గాన్​లో మరోసారి వరుస పేలుళ్ల ఘటనలు కలకలం రేపాయి. సైన్యం, పోలీసు వాహనమే లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడుల్లో.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు క్షతగాత్రులయ్యారు.

Afghan police: 3 separate Kabul explosions kill 5, wound 2
అఫ్గాన్​లో పేలుళ్లు- ఐదుగురు మృతి
author img

By

Published : Feb 20, 2021, 3:06 PM IST

అఫ్గాన్​ రాజధాని కాబుల్​లో శనివారం మూడు వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

సైనిక వాహనాన్ని లక్ష్యంగా 15నిమిషాల వ్యవధిలో తొలి రెండు దాడులు జరిగాయి. ఇందులో ఇద్దరు జవాన్లతో సహా.. ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. మరో రెండు గంటల తర్వాత పోలీసు వాహనం లక్ష్యంగా జరిగిన మూడో దాడిలో ఇద్దరు రక్షక భటులు మృతిచెందారని కాబుల్​ పోలీసు ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో మరో పౌరుడు గాయపడినట్టు చెప్పారు.

ఈ ఘటనకు ఎవరూ తక్షణ బాధ్యత వహించలేదు. పేలుళ్లకు కారణమేంటనేది కూడా స్పష్టంగా తెలియరాలేదు. అయితే.. ఇస్లామిక్​ స్టేట్​ గ్రూప్​ అనుబంధ సంస్థ.. వీటిలో కొన్నింటికి బాధ్యత వహిస్తున్నట్టు వెల్లడించారు. తాలిబన్లే ఈ ఘటనకు కారణమని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

వరుస బాంబు పేలుళ్ల ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

దశాబ్ద కాలంగా సాగుతున్న వైరాన్ని తొలగించేందుకు.. ఖతార్​లో తాలిబన్లకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న శాంతి చర్చలు నిలిచిపోయాయి. ఈ తరుణంలో వరుస బాంబు పేలుడు ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

ఇదీ చదవండి: గల్వాన్​ ఘర్షణపై చైనా 'బూటకపు' వీడియో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.