ETV Bharat / international

రెండు మినీ వ్యాన్ల పేల్చివేత- ఏడుగురు మృతి!

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​లో రెండు చోట్ల బాంబు దాడులు జరిగాయి. ఈ దాడిలో ఏడుగురు చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

bomb blast
బాంబు దాడి
author img

By

Published : Jun 12, 2021, 7:05 PM IST

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​లో షియా ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. రెండు మినీ వ్యాన్లపై దాడి జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

పశ్చిమ కాబూల్‌లోని ఓ రహదారిపై 2 కిలోమీటర్ల పరిధిలో రెండు మినీ వ్యాన్లను పేల్చినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి అహ్మద్ జియా తెలిపారు. అయితే ఈ దాడిలో ఏ రకమైన బాంబులు ఉపయోగించారు అనే దానిపై స్పష్టత లేదు. దాడులకు ఇప్పటివరకూ ఏ సంస్థ బాధ్యత వహించలేదు. గతంలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఈ ప్రాంతంలో ఇలాంటి బాంబు దాడులు చేసింది. ఈ నెల ప్రారంభంలో నాలుగు మినీవ్యాన్లపై దాడులు జరిగాయి. ఇందులో 18 మంది మరణించారు.

మొదటి పేలుడు సంభవించినప్పుడు ఆరుగురు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. రెండో పేలుడు కరోనా రోగులు చికిత్సపొందుతున్న మహమ్మద్​ అలీ జిన్నా ఆసుపత్రి ప్రాంగణ సమీపంలో జరిగింది. ఇందులో ఒకరు చనిపోగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి.

ఇదీ చూడండి: పరిశ్రమలో విషవాయువు లీక్​- 8 మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.