ETV Bharat / international

Afghan Crisis: మీడియాకు తాలిబన్ల వార్నింగ్​- 'మసూద్' వార్తలపై నిషేధం!

తిరుగుబాటు ఉద్యమ నాయకుడు అహ్మద్​ మసూద్​(Ahmad Massoud) సందేశాలు ప్రసారం చేయకుండా తాలిబన్లు (Aghan Taliban) మీడియాపై నిషేధం విధించారు. దేశవ్యాప్తంగా ప్రజలు పోరాటంలో పాల్గొనాలని మసూద్ ఫేస్​బుక్ వేదికగా పిలుపునిచ్చిన మరునాడే ఈ ఆంక్షలకు ఉపక్రమించారు.

Taliban prohibits media for circulating news of Resistance leader Ahmad Massoud
మసూద్​ సందేశాలు ప్రసారం చేయొద్దని తాలిబన్ల హుకుం!
author img

By

Published : Sep 7, 2021, 12:26 PM IST

పంజ్​షేర్(Panjshir Valley)​ తిరుగుబాటు ఉద్యమ నాయకుడు అహ్మద్​ మసూద్​కు(Ahmad Massoud) సంబంధించిన వార్తలు ప్రసారం చేయొద్దని అప్ఘానిస్థాన్ మీడియాకు తాలిబన్లు(Aghan Taliban) హుకుం జారీ చేశారు. ఆయన పంపే సందేశాలు ఎక్కడా కనిపించకుండా నిషేధం విధించారు. అఫ్గాన్ ప్రజలంతా దేశ గౌరవం కోసం పోరాడాలని మసూద్ ఫేస్​బుక్ వేదికగా సోమవారం పిలుపునిచ్చిన నేపథ్యంలో తాలిబన్లు ఈ ఆంక్షలు విధించారు. ఈ మేరకు రష్యా వార్తా సంస్థ స్పుత్నిక్ వెల్లడించింది. మసూద్ సారథ్యంలోని నేషననల్ రెసిస్టెన్స్ ఫ్రంట్​కు(National Resistance Front) చెందిన ఓ నాయకుడు ఈ విషయం తమకు చెప్పినట్లు పేర్కొంది.

అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కార్జాయ్​, జాతీయ ఐక్యత ఉన్నత మండలి మాజీ ఛైర్మన్​ అబ్దుల్లా అబ్దుల్లాలు ప్రజలతో మాట్లాడకుండా తాలిబన్లు(Taliban News) నియంత్రించారని కూడా స్పుత్నిక్ తెలిపింది.

భిన్న ప్రకటనలు..!

అఫ్గాన్​లో అన్ని రాష్ట్రాలను ఆక్రమించుకున్న తాలిబన్లు పంజ్​షేర్​ను(Taliban Punjshir) కూడా తమ అధీనంలోకి తెచ్చుకున్నట్లు సోమవారం ప్రకటించారు. అయితే ఇది వాస్తవం కాదని తుది శ్వాసవరకు తాలిబన్లపై పోరాటం చేస్తామని పంజ్​షేర్ తిరుగుబాటు నాయకుడు మసూద్​ సోమవారం ఫేస్​బుక్ వేదికగా ఆడియో సందేశం పంపారు. అఫ్గాన్ ప్రజలు ఇంటా బయటా ఎక్కడున్నా దేశ గౌరవం, స్వేచ్ఛ, సమృద్ధి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

పంజ్​షేర్​పై తాలిబన్లు, ఎన్​ఆర్​ఎఫ్ భిన్న ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రాంత తమ నియంత్రణలో వచ్చిందని తాలిబన్లు ప్రకటించగా.. మసూద్ మాత్రం ఇది అవాస్తవమని తెలిపారు. యుద్ధం ఇంకా కొనసాగుతోందన్నారు. తమ మధ్య జరిగిన భీకర పోరులో వందల మందిని హతం చేశామని ఇరు వర్గాలు ప్రకటించాయి.

ఈ ఘర్షణల్లో ఎన్​ఆర్​ఎఫ్(Afghanistan National Resistance Front) అధికార ప్రతినిధిని తాలిబన్లు హతమార్చగా.. వారి కీలక కమాండర్​ను ఎన్​ఆర్​ఎ​ఫ్​ మట్టుబెట్టింది.

ఇదీ చదవండి Taliban Panjshir: తాలిబన్లకు ఎదురుదెబ్బ.. సీనియర్​ కమాండర్‌ హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.