ETV Bharat / international

కాబుల్​ దాడి ఆత్మాహుతి దళ సభ్యుల హతం - suiside

అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్​లో మరోసారి ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఆత్మాహుతి దళ సభ్యులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

అఫ్గానిస్థాన్​​లో ఆత్మాహుతి దాడి..  7గురి మృతి
author img

By

Published : Apr 21, 2019, 7:26 AM IST

Updated : Apr 21, 2019, 8:29 AM IST

అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్​లో ఉగ్రవాదులు భీకర దాడులకు తెగబడ్డారు. ఆరుగంటల పాటు కాల్పులు జరిపి... అనంతరం సమాచార శాఖ కార్యాలయం ఎదుట ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేశాడు. ఇదే తరహా దాడికి యత్నించిన మరో నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

ఈ ఘటనలో ముగ్గురు సైనికులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి.

దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రసంస్థ ప్రకటన చేయలేదు. ఖతార్ వేదికగా తాలిబన్లతో ప్రభుత్వం జరపాల్సిన చర్చలు శుక్రవారం రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లే దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ ఆరోపణలకు వివరణనిచ్చింది తాలిబన్. ఉగ్రదాడి తమ పని కాదని ప్రకటించింది.

ప్రభుత్వ కార్యాలయ సముదాయంలోకి వెళ్లకుండా ఉగ్రవాదులను అడ్డుకోగలిగామని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటించింది. కార్యాలయ సముదాయంలోకి వెళ్లి ఉంటే 2700మంది ఉద్యోగులకు ముప్పు వాటిల్లేదని తెలిపింది.

ఇదీ చూడండి: 'నన్ను విమర్శించే నైతిక హక్కు సీఎంకు లేదు'

Supaul (Bihar), Apr 20 (ANI): Congress president Rahul Gandhi on Saturday addressed a public rally in Bihar's Supaul. While addressing the rally he slammed Prime Minister Narendra Modi on his 'Chowkidar' word. He said that youngsters from Bihar who do job of a watchman are honest. Slamming PM Modi he said that the Prime Minster called him 'Chowkidar' of nation but in reality he is a 'Chowkidar' of Anil Ambani and he defamed all the youngsters of Bihar.
Last Updated : Apr 21, 2019, 8:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.