కొవిడ్ 19, దాని రకాల వ్యాప్తిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, నిబంధనలను పాటించడమే సరైన మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగ్నేయాసియ ప్రాంత డైరెక్టర్ డా. పూనమ్ ఖేత్రపాల్ సింగ్ అన్నారు. టెస్ట్, ట్రేస్, ఐసొలేట్, ట్రీట్మెంట్ కోసం చేస్తున్న కృషిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఏప్రిల్ ఆరంభం నుంచి భారత్లో తీవ్ర స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం మరో 1,45,384 కొత్త కేసులతో దేశంలో కేసుల సంఖ్య 1,32,05,926కు పెరిగింది.
ఈ నేపథ్యంలో లాక్డౌన్లతో సంబంధం లేకుండా సమూహాల్లో తిరగకపోవడం, భౌతిక దూరం లాంటివి కొవిడ్ వ్యాప్తిని మందగిస్తాయని సింగ్ సూచించారు. మహమ్మారిపై పోరాటంలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, దగ్గేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ప్రధానమని చెప్పారు. ప్రజారోగ్య, సామాజిక చర్యలను కఠినంగా అమలు చేయడం వైరస్ వ్యాప్తి నిరోధానికి కీలకమని అన్నారు.
ఇదీ చూడండి: ప్రశాంత్ కిశోర్ నోట భాజపా అనుకూల మాట!