ETV Bharat / international

నేపాల్​లో బస్సు లోయలో పడి 9మంది మృతి - లోయలో పడిన బస్సు

నేపాల్​లో ప్రయాణికుల బస్సు లోయలో పడిన ఘటనలో 9 మంది మరణించారు. మరో 34 మంది గాయపడ్డారు. వీరిలో 9 మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

nepal accident
లోయలో పడిన బస్సు
author img

By

Published : Nov 13, 2020, 8:38 AM IST

నేపాల్​లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పశ్చిమ నేపాల్​లోని బైఠాడి జిల్లాలో కొడ్పెలోని దశరథ్ చాంద్​ రహదారిపై అదుపు తప్పిన బస్సు.. లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మరో 34 మందికి గాయాలయ్యాయి.

మహేంద్రనగర్​ నుంచి ఘన్నా వెళుతుండగా గురువారం రాత్రి 11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 8 గంటలకు సహాయకచర్యలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు 8 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.

క్షతగాత్రుల్లో తొమ్మిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: 26/11 దాడులను ఎట్టకేలకు అంగీకరించిన పాక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.