అఫ్గానిస్థాన్‌లోని నంగర్హర్ సైనిక స్థావరంపై కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం ఎనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని సైన్యం ప్రకటించింది.
షిర్జాద్ జిల్లాలోని గండుమక్లో పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సైనిక స్థావరంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని స్థానిక ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఉగ్రవాదులు జలాలాబాద్ నగరంలోనూ పేలుళ్లకు ప్రణాళికలు రచించారని.. ఈ మేరకు పేలుడు పదార్థాలు నింపిన వాహనాన్ని భద్రతా దళాలు కనుగొన్నాయని అధికారులు వెల్లడించారు.
ఈ పేలుళ్లకు బాధ్యత వహించిన తాలిబన్.. ముల్లా మొహమ్మద్ యూసుఫ్ కాందహారి అనే ముష్కరుడు పేలుడు పదార్థాలు ఉన్న కారుతో ఆత్మహుతికి పాల్పడ్డాడని వెల్లడించింది.
ఇదీ చదవండి: 'భారత్-పాక్‌ల మధ్య యుద్ధం ప్రపంచానికే పెను ముప్పు'