ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 70లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎవ్వరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆదివారం నాటికి 70లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్​లో కొవిడ్​ బాధితుల సంఖ్య లక్షకు చేరువైంది. బంగ్లాదేశ్​లోనూ కరోనా విజృంభిస్తోంది.

Global COVID-19 tracker
కరోనా కలకలం: లక్షకు చేరువలో పాక్​... చైనాలో దొంగ కేసులు
author img

By

Published : Jun 7, 2020, 8:22 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఆదివారం నాటికి 70 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 4లక్షల మందికిపైగా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.

Global COVID-19 tracker
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసు వివరాలు

లక్షకు చేరువలో...

పాకిస్థాన్​లో గడిచిన 24 గంటల్లో మరో 4,960 కేసులు నమోదయ్యాయి. వైరస్​ వ్యాప్తి అధికమవుతున్నందున లాక్​డౌన్​ ఆంక్షలు తిరిగి అమలు చేయాలన్న డిమాండ్​ను పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ తోసిపుచ్చారు. ఈ విధంగా చేయడం వల్ల దేశంలో ఆర్థిక వ్యవస్థ పడిపోయి.. పేదరికం పెరిగుతుందని అన్నారు.

ఒక్కరోజులో అత్యధిక మరణాలు..

బంగ్లాదేశ్​లో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం రికార్డు స్థాయిలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో నమోదైన మరణాల్లో ఇవే అత్యధికం. మరో 2,743 మంది వైరస్​ బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 65 వేల 769కి చేరింది.

సింగపూర్​లో...

సింగపూర్​లో కొత్తగా 383 మందికి కొవిడ్ పాజిటివ్​ నిర్ధరణ అయ్యింది. వీరిలో ఆరుగురు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 37,910కి చేరుకుంది.

చైనాలో దొంగ కరోనా కేసులు..

చైనాలో కొత్తగా 11 మందికి వైరస్​ నిర్ధరణ అయ్యింది. వీరిలో ఐదుగురికి ఎటువంటి లక్షణాలు లేవు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.