అఫ్గానిస్థాన్‌లో జరిగిన తిరుగుబాటు కార్యకలాపాలు, ఘర్షణల్లో 59 మంది మరణించినట్లు స్థానిక యుద్ధ పర్యవేక్షణ బృందం 'రిడక్షన్ ఇన్ వయలెన్స్(రివి) బుధవారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఎనిమిది మంది పౌరులు, తొమ్మిది మంది అఫ్గాన్ నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ (ఏఎన్డీఎస్ఎఫ్) సిబ్బంది, 42 మంది తాలిబన్ ఉగ్రవాదులు మరణించినట్లు తెలిపింది.
ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది రివి. అదే సమయంలో 30 మంది పౌరులు, 38 తాలిబాన్ ఉగ్రవాదులు, ఏడుగురు భద్రతా దళ సభ్యులు గాయపడ్డారని తెలిపింది.
ఏడు రాష్ట్రాల్లో 15 హింసాత్మక ఘటనలు జరిగాయని రివి పేర్కొంది. ఈ ప్రాంతాల్లోనే ప్రాణనష్టం సంభవించిందని వెల్లడించింది.
ఇదీ చదవండి: అఫ్గాన్‌లో కారు బాంబు దాడి- 8 మంది మృతి