ETV Bharat / international

మయన్మార్​ సైన్యం చేతిలో మరో పది మంది బలి - మయన్మార్​ వార్తలు

మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమంపై ఆ దేశ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ఐక్యరాజ్య సమితి వినతిని లెక్కచేయకుండా ఆందోళనకారులపై కాల్పులను కొనసాగిస్తోంది. తాజాగా.. యాంగూన్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 10మంది పౌరులు మృతిచెందారు.

4 killed as Myanmar forces continue crackdown on protesters
మయన్మార్​ ప్రజా ఉద్యమంలో మరో పది మంది మృతి
author img

By

Published : Mar 13, 2021, 5:27 PM IST

మయన్మార్​లో సైన్యం మరోసారి నిరసనకారులపై కాల్పులు జరిపింది. వేరువేరు నగరాల్లో జరిగిన ఈ ఘటనల్లో పది మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. అనేకమందిని అరెస్టు చేశారు. యాంగూన్‌ సహా ఇతర ప్రధాన నగరాల్లో రోడ్లెక్కిన ఆందోళనకారులపై బాష్పవాయువు గోళాలు, జల ఫిరంగులు ప్రయోగించారు.

మయన్మార్​లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమం చేపట్టారు. అయితే దేశంలోని యాంగూన్​లో శుక్రవారం రాత్రి ముగ్గురిని కాల్చి చంపినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. వారం రోజులుగా విధించిన కర్ఫ్యూని కాదని ప్రజలు బయటకు రావడం వల్ల వారిని కాల్చి చంపినట్లు తెలిపారు. అతిపెద్ద నగరమైన మాండలేలో ముగ్గురు చనిపోగా.. దక్షిణ-మధ్య మయన్మార్‌లోని ప్యేయ్​లో మరోకరు సైన్యం తూటాకు ప్రాణాలు వీడిచారు. అయితే ఈ ఘటనలకు సంబంధించి గాయపడిన, చనిపోయిన వారి ఫోటోలు, పలు నివేదికలు సామాజిక మాద్యమాల్లో వెలుగు చూశాయి.

ఐక్యరాజ్యసమితికి చెందిన మానవ హక్కుల నిపుణుడు టామ్​ ఆండ్రూస్​... మయన్మార్​లో జరుగుతోన్న మారణకాండపై ఓ నివేదికను విడుదల చేశారు. ఇప్పటి వరకు ఆ దేశంలో 70 మందికి పైగా ప్రజలను భద్రతాదళాలు చంపినట్లు అందులో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఐరాస విజ్ఞప్తి బేఖాతరు- పది మంది కాల్చివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.