ETV Bharat / international

సిరియా రక్తపాతంలో 3,80,000 మంది బలి - సిరియా మరణాలు

సిరియా యుద్ధం కారణంగా ఆ దేశంలోని సగానికి పైగా జనాభా ఇళ్లను వీడింది. 2011లో మొదలైన రక్తపాతంలో ఇప్పటి వరకు 3 లక్షల 80వేల మంది చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక మంది వలస వెళ్లింది ఈ ప్రాతం నుంచే. సిరియా యుద్ధం కారణంగా వాటిల్లిన ప్రాణనష్టం, ఆస్తి నష్టం వివరాలు సవివరంగా...

syria war
సిరియా రక్తపాతంలో 3,80,000 మంది బలి
author img

By

Published : Mar 12, 2020, 10:50 PM IST

అంతర్యుద్ధం కారణంగా సిరియా అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంది. ఆ దేశాధ్యక్షుడు బషర్​ అల్ అసద్​కు వ్యతిరేకంగా 2011లో మొదలైన మృత్యుఘోష ఇంకా కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 3,80,000 మంది మరణించినట్లు బ్రిటన్​కు చెందిన సిరియా మానవహక్కుల పర్యవేక్షణ సంస్థ తెలిపింది. ఇంకా ఎన్నో నమ్మశక్యం కాని నిజాలను వెల్లడించింది.

మరణాలు

  • ఇప్పటివరకు 3లక్షల 80వేల మంది మరణించారు.
  • చనిపోయిన వారిలో 1,15,000 మంది పురుషులు, 22,000 మంది చిన్నారులు, 13,612 మంది మహిళలు ఉన్నారు.

దివ్యాంగులు

  • యుద్ధంలో పలువురు గాయాలపాలవడం వల్ల సిరియాలో దివ్యాంగుల శాతం 30కి పెరిగింది.
  • ఇది ప్రపంచ దివ్యాంగుల సగటుకు రెట్టింపు శాతం

స్థానభ్రంశం

  • యుద్ధం కారణంగా ఆ దేశంలో లక్షల మంది స్థానచలనం చెందారు.
  • దాదాపు 2.3 కోట్ల మంది తమ ఇళ్లను విడిచిపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యధికం.
  • 2020 ఫిబ్రవరి నాటికి సిరియా నుంచి 55 లక్షల మంది విదేశాలకు వలస వెళ్లారు.
  • 60 లక్షల మంది సిరియాలోనే ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు.

ఆశ్రయాలు

  • సిరియా నుంచి వచ్చిన 36 లక్షల మంది శరణార్థులకు టర్కీ ఆశ్రయం కల్పిస్తోంది.
  • లెబనాన్​ 15 లక్షల మంది సిరియన్లకు చోటు ఇచ్చింది.
  • జోర్డాన్​లో 6,50,000 మంది సిరియన్లు ఉన్నట్లు యూఎన్​హెచ్​సీఆర్​ తెలిపింది. ప్రభుత్వం మాత్రం 13 లక్షల మంది ఉన్నట్లు చెబుతోంది.
  • 3 లక్షల మంది సిరియన్లు ఇరాక్​లో, లక్షా 30 వేల మంది ఈజిప్ట్​లో ఆశ్రయం పొందుతున్నారు.
  • వేలాది మంది సిరియన్లు ఐరోపాకు వలస వెళ్లారు. ఎక్కువగా జర్మనీలో ఆశ్రయం పొందుతున్నారు.

చిత్రహింసలు..

  • యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్​ పాలనలో హింస, అత్యాచారం, మరణశిక్షలతో సహా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి.
  • 60 వేల మంది చిత్రహింసల కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది.
  • 5 లక్షల మంది జైళ్లలోనే మగ్గుతున్నారు.
  • 2011-2015 మధ్యకాలంలో డమస్కస్​ సమీపంలోని ఓ జైల్లో 13 వేల మందిని ఉరితీసినట్లు 2017లో 'అమ్నెస్టి ఇంటర్నేషనల్' తెలిపింది.
  • అదే సమయంలో మరికొన్ని వేల మందిని జిహాదిస్టు గ్రూపులు నిర్వహించే జైళ్లలో ఉరితీసినట్లు అమ్నెస్టి పేర్కొంది.

ఆర్థికవ్యవస్థ పతనం..

  • యుద్ధం కారణంగా సిరియాలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది.
  • నిరుద్యోగం, విద్యుత్ కొరత, గ్యాస్ కొరత ఏర్పడింది.
  • 83 శాతం సిరియన్లు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు. 2011కు ముందు ఇది 28 శాతం మాత్రమే.
  • చమురు, గ్యాస్ రంగాలకు దాదాపు 74 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లినట్లు అంచనా.
  • 400 బిలియన్​ డాలర్ల మేర ఆస్తి నష్టం, అనేక ప్రాంతాలు ధ్వంసం.

ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం సిరియానే విపత్కర పరిస్థితిలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.