అఫ్గానిస్థాన్ హెల్మాండ్ రాష్ట్రంలో జరిగిన దాడిలో ఇద్దరు కమాండర్లతో సహా.. మొత్తం 25 మంది తాలిబన్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టు పేర్కొంది ఆ దేశ సైన్యం. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్టు తెలిపింది.
నావాయీ బరాక్జాయి ప్రాంతంలోని అఫ్గాన్ నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్(ఏఎన్డీఎస్ఎఫ్) స్థావరాలపై దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. వారి ప్రయత్నాలను తిప్పికొట్టిన అఫ్గాన్ సైనికులు.. ఎదురు కాల్పులకు దిగారు. ఈ నేపథ్యంలోనే సైన్యం.. 25మంది ముష్కరుల్ని హతమార్చినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. కాబూల్‌కు నైరుతి దిశగా 555 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో.. 6 ఉగ్రవాద రహస్య స్థావరాలు, 25 రక్షణ స్థానాలు ధ్వంసమైనట్టు పేర్కొంది.
అయితే.. ఈ ఆపరేషన్‌పై తాలిబన్ ఉగ్రవాద సంస్థ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఇదీ చదవండి: 'నిరసన చేపట్టే హక్కు రైతులకు ఉంది'