నైరుతి చైనాలోని సిచువాన్ అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. మంటలు అదుపు చేసే క్రమంలో ఇప్పటి వరకు 24 మంది అగ్నిమాపక సిబ్బంది మరణించారని ప్రసార మాధ్యమాలు వెల్లడిస్తున్నాయి.
శనివారం లియాంగ్షన్ యీ అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. తక్షణమే స్పందించిన అధికారులు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. ఆదివారం ఎదురుగాలుల ప్రభావంతో అగ్నికీలలు దిశలు మార్చుకొని మరింతగా వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని సుమారు 24 మంది అగ్నిమాపక సిబ్బంది మరణించారు. మరో వైపు 30 మంది పౌరుల ఆచూకీ గల్లంతైందని అధికారులు వెల్లడించారు.
మంటలు అంతకంతకూ విస్తరిస్తుండడం వల్ల స్థానిక ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. అత్యవసర నిర్వహణ మంత్రిత్వశాఖ పంపిన బృందం లియాంగ్షన్ యీ ప్రాంతంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది.
ఇదీ చూడండి:విమాన ప్రమాదంలో రష్యా సంపన్నురాలు మృతి