పాకిస్థాన్ ఖైబర్ పంఖ్తుఖ్వా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఆటో కాలువలోకి దూసుకెళ్లి 20 మంది మృత్యువాత పడ్డారు.
సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. ముగ్గురిని ప్రాణాలతో కాపాడారు. 20 మృతదేహాలను వెలికితీశారు. ఇందులో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మెహమూద్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.