నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి దేశవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొండచరియలు విరిగిపడి దాదాపు 17 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 13 మంది గాయాలపాలయ్యారు.
దేశ రాజధాని కాఠ్మాండులోని ముల్పని ప్రాంతంలో ఓ ఇంటిపై కొండ చరియలు విరిగిపడి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నేపాల్‌లోని అన్ని ప్రధాన రహదారులపై నీరు నిలిచి రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
ప్రాథమిక నివేదిక ప్రకారం మోరాంగ్లోని 400, బారాలోని 35 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
- ఇదీ చూడండి: అమెరికా వాషింగ్టన్లో వరుస భూకంపాలు