ETV Bharat / international

పెళ్లి బృందంపై పిడుగు.. 16 మంది మృతి

సరదాగా గడుపుతూ వెళుతున్న పెళ్లిబృందంపై పిడుగుపడింది. ఈ ఘటనలో 16మంది మరణించారు. వరుడితో సహా మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లింట తీరని శోకాన్ని నింపిన ఈ విషాదకర ఘటన బంగ్లాదేశ్​లో సంభవించింది.

lightning
lightning
author img

By

Published : Aug 4, 2021, 11:37 PM IST

Updated : Aug 5, 2021, 12:17 AM IST

బంగ్లాదేశ్‌లో ఓ వివాహ బృందంపై పిడుగులు పడిన ఘటనలో ఏకంగా 16 మంది మరణించారు. చాపై నవాబ్‌గంజ్ జిల్లా శిబ్‌గంజ్​ అనే ప్రాంతంలో వివాహ బృందం పడవలో ప్రయాణిస్తుండగా ఈ పిడుగులు పడినట్లు తెలుస్తోంది. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో వరుడు సైతం ఉడటంతో బంధువులు రోదనలు మిన్నంటాయి.

'వివాహ బృందం ప్రయాణిస్తున్న పడవపై సెకన్ల వ్యవధిలో పిడుగులు పడి.. సంఘటనా స్థలంలోనే 16 మంది మరణించారని' సకీబ్ అల్ రబ్బీ అనే అధికారి తెలిపారు. 'అదృష్టవశాత్తూ వధువు ఈ పడవలో లేదని' చెప్పారు.

బంగ్లాదేశ్‌లో పిడుగుపాటుకు ప్రతీఏటా వందలమంది మరణిస్తుంటారు. 2016 నుంచి వీటిని ప్రకృతి విపత్తుగా ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.

ఇవీ చదవండి:

Last Updated : Aug 5, 2021, 12:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.