ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు రహదారులపై టైర్లకు నిప్పంటించారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన దాడిలో మరో ఐదుగురు మరణించారు. సైన్యం రంగంలోకి దిగినప్పటికీ నిరసనకారులు ఎవర్నీ లెక్కచేయడం లేదు. ఇప్పటివరకు ఒక్క బాగ్దాద్‌లోనే ఐదురోజుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాజకీయనాయకులు, ప్రభుత్వం శాంతించమని కోరుతున్నప్పటికీ ఆందోళనలు చల్లారడం లేదు. వీరిపై బాష్పవాయువును ప్రయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
దేశంలో నెలల తరబడి కరెంటు కోతలు, నీటి కొరత, నిరుద్యోగం, అవినీతితో విసుగు చెందిన స్థానికులు.. నిరసన బాట పట్టారు. అవినీతికి అంతం పలికి ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి : ఇరాక్: హింసాత్మక ఘటనల్లో 34కు చేరిన మృతులు