ఫిలిప్పీన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఎస్యూవీ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో 13 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ కూడా మృతి చెందినట్లు పేర్కొన్నారు.
కళింగ రాష్ట్రంలోని తబుక్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సమీపంలోని గ్రామస్థుల సాయంతో బాధితులను వెలికితీశారు. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: నేపాల్లో ముగ్గురు రష్యా పర్వతారోహకులు గల్లంతు