పాకిస్థాన్లోని సింధు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
సింధూ రాష్ట్రంలోని మూడో అతిపెద్ద నగరం సుక్కూర్కు సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు జియో న్యూస్ తెలిపింది. ముల్తాన్ నుంచి కరాచీ వేళ్తున్న క్రమంలో బోల్తా పడినట్లు పేర్కొంది. ఆ సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నట్లు తెలిపింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు, మృతుల్లో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నట్లు వెల్లడించింది.
బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులందరని బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. స్థానికుల సాయంతో ఆసుపత్రులకు తరలించి క్రేన్ల సాయంతో బస్సును రోడ్డుపై నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉండటం, ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా లేకపోవటం వల్ల పాకిస్థాన్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారిపోయాయి.
ఇదీ చూడండి: దేశంలో మరో 2.76 లక్షల మందికి వైరస్