ETV Bharat / international

జపాన్​లో హిమపాతానికి 13 మంది బలి - జపాన్ వాాతావరణ శాఖ హెచ్చరిక

జపాన్​ తీర ప్రాంతాల్లోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆ దేశ విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరించింది. హిమపాతానికి ఇప్పటివరకు 13మంది మృతి చెందారని ప్రకటించింది.

13 dead, 250 injured as record snowfall blankets Japan
జపాన్​లో హిమపాతానికి 13మంది మృతి
author img

By

Published : Jan 12, 2021, 6:58 PM IST

జపాన్​ తీర ప్రాంతాల్లో తీవ్ర హిమపాతం కారణంగా ఇప్పటివరకు 13మంది మృతి చెందారు. సుమారు 250 మంది గాయపడ్డారు. ఈ మేరకు వెల్లడించిన విపత్తు నిర్వహణ విభాగం.. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.

ఫుకుయ్ జిల్లాలో 60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు గల ముగ్గురు వృద్ధులు మృతిచెందారని తెలిపింది. మరో 47 మంది హిమపాతానికి సంబంధించి జరిగిన ప్రమాదాల్లో గాయపడ్డారని పేర్కొంది. నీగటా జిల్లాలో మంచును తొలగించే క్రమంలో నలుగురు మృతి చెందారని తెలిపింది.

రాకపోకలకు అంతరాయం..

మంచు తుపాను ధాటికి జపాన్​లోని వివిధ ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. ఫుకుయ్ జిల్లాలోని రహదారిపై 1200 వాహనాలు నిలిచిపోయాయి. టొయోమా, నీగటా జిల్లాల్లోనూ ఇటువంటి పరిస్థితే నెలకొంది.

ఇదీ చదవండి : ట్రంప్​కు ఫేస్​బుక్, ట్విట్టర్ వరుస షాకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.