World population: 2021లో ప్రపంచ జనాభా భారీగా పెరిగింది. 2022 జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా 780కోట్లుగా ఉంటుందని అమెరికా సెన్సస్ బ్యూరో అంచనా వేసింది. 2021 జనవరి 1 నుంచి 2022 జనవరి 1 మధ్య ప్రపంచ జనాభా 7.4 కోట్ల మేర పెరిగిందని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది కాలంలో ప్రతి సెకనుకు 4.3 మంది పుడితే.. ఇద్దరు మరణించారని పేర్కొంది.
US census Bureau:
అమెరికా సెన్సస్ బ్యూరో ఇంకా ఏం చెప్పిందంటే..?
- గతేడాది నుంచి అమెరికాలో జనాభా.. 7,07,000 మేర పెరిగింది.
- 2022 జనవరి 1 నాటికి అమెరికాలో మొత్తం జనాభా 33.24 కోట్లకు చేరనుంది.
- 2021 జనవరి 1 నుంచి 2022 జనవరి1 నాటికి 0.2శాతం జనాభా వృద్ధి నమోదైంది.
- 2022 ఏడాది ప్రారంభం నుంచి అమెరికాలో ప్రతి 40 సెకన్లకు ఒకటి చొప్పున జననాలు నమోదవుతాయి.
- మొత్తంగా అమెరికాలో ప్రతి 9 సెకన్లకు ఒక జననం.. ప్రతి 11 సెకన్లకు ఒక మరణం నమోదవనుంది.
ఈ శతాబ్దపు ప్రపంచ జనాభా 2064లో అత్యధికంగా ఉంటుందని అధ్యయనకర్తలు గతంలో అంచనా వేశారు. అయితే.. శతాబ్దం చివరి నాటికి అందులో 50% తగ్గుదల కనిపిస్తుందని తెలిపారు. వివిధ రకాల ఒత్తిళ్ల కారణంగా మానవ పునరుత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణమవుతుందని చెప్పారు.
ఇదీ చూడండి: Loans for babies: పిల్లల్ని కంటే రూ. 25 లక్షల రుణం.. చైనా కొత్త రూల్!
ఇదీ చూడండి: అమెరికా జనాభా వృద్ధిపై 'కరోనా' పోటు- ఏడాదిలో 0.1 శాతమే..