World Covid cases: ప్రపంచదేశాల్లో కరోనా విశృంఖలంగా వ్యాపిస్తూనే ఉంది. అన్ని దేశాల్లో కలిపి కొత్తగా 19 లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. భారత్ సహా అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉంది.
US Covid news:
అగ్రరాజ్యంలో కొత్తగా 2.87 లక్షల కేసులు నమోదయ్యాయి. 346 మంది మరణించారు. ఆస్పత్రులు చాలా వరకు కొవిడ్ రోగులతో నిండిపోయాయి. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 8,73,564కు పెరిగింది. మొత్తం కేసులు 6 కోట్ల 69లక్షలు దాటాయి.
France covid update:
ఫ్రాన్స్‌లో మరో 2,78,129 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 98మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 30 వేల మంది కోలుకున్నారు.
లక్షా 50 వేలు..
ఇటలీలో కరోనా తీవ్రంగానే ఉంది. కొత్తగా లక్షా 50 వేల కేసులు నమోదు కాగా.. 248 మంది కొవిడ్ తీవ్రతతో ప్రాణాలు కోల్పోయారు. 79 వేల మంది తాజాగా కోలుకున్నారు.
మరణ మృదంగం!
మరోవైపు, రష్యాలో కరోనా మరణాలు భారీగానే నమోదవుతున్నాయి. 24 గంటల్లో 686 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసుల సంఖ్య 29 వేలుగా ఉంది.
ఆస్ట్రేలియాలో తీవ్రం
ఆస్ట్రేలియాలో కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 87 వేల మంది కరోనా బారిన పడ్డట్లు తేలింది. 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 73 లక్షలుగా ఉంది.
ఇదీ చదవండి: Covid impact on Education: 'కరోనా వేళ పాఠశాలల మూసివేతను సమర్థించలేం'