చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు ఒక కోటి దాటాయి. మృతుల సంఖ్య కూడా 5 లక్షలకు పైగా పెరిగిపోయింది. కాగా 54 లక్షలకు పైగా బాధితులు కోలుకున్నారు.
కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అమెరికాలో కొత్తగా 41,561 కేసులు నమోదుకాగా... 498 మంది మరణించారు. దీనితో మొత్తం కేసులు 2,594,517కి, మరణాలు 128,138కి పెరిగాయి.
బ్రెజిల్లో కొత్తగా 33,613 కేసులు, 961 మరణాలు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసులు 1,313,667కి, మరణాలు 57,070కి చేరాయి.
రష్యాలో 6,852 కేసులు, 188 మరణాలు కొత్తగా నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 627,646కి, మృతుల సంఖ్య 8,969కి పెరిగింది.
ఇక భారత్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారత్లో కరోనా కేసులు ఐదు లక్షలు దాటగా, మృతుల సంఖ్య 16 వేలు దాటింది.
- మొత్తం కేసులు: 10,067,146
- మొత్తం మరణాలు: 500,546
- కోలుకున్నవారు: 5,451,674
ఇదీ చూడండి: అమెరికా నిఘా విమానాలను అడ్డుకున్న రష్యా