Women Stabbed Date: ప్రతీకారం తీర్చుకోవడానికి ఆన్లైన్ డేటింగ్ సైట్లో పరిచయం చేసుకుని.. ఓ వ్యక్తిని కత్తితో పొడిచింది మహిళ. 2020 నాటి అమెరికా డ్రోన్ దాడిలో చనిపోయిన ఇరాన్ మిలిటరీ లీడర్ ఖాసిం సులేమానీ మృతికి ప్రతీకారంగా ఈ ఘటనకు పాల్పడినట్లు నిందితురాలు తెలిపింది.
ఇదీ జరిగింది..
నికా నికౌబిన్ (21).. ప్రతీకారం తీర్చుకోవడానికి బాధితున్ని ఆన్లైన్ డేటింగ్ సైట్ ద్వారా పరిచయం చేసుకుంది. స్థానికంగా ఓ హోటల్లో మార్చి 5న కలుసుకునేందుకు అతన్ని ఒప్పించింది. ఇందుకు ఓ రూమ్‌ను అద్దెకు తీసుకున్నారు. గదిలో శృంగారంలో పాల్గొనే సమయంలో నికౌబిన్.. బాధితుని కళ్లకు గంతలు కట్టింది. ఆ తర్వాత లైట్లను ఆర్పివేసింది. చీకటిలో బాధితున్ని ఏమార్చి శృంగారంలో పాల్గొంది. అప్పుడే గొంతుపై కత్తితో దాడి చేసింది. నిందితురాలిని పక్కకు తోసి హోటల్ గది నుంచి బయటపడ్డాడు బాధితుడు. తీవ్ర రక్తస్రావంతో పోలీసులకు ఫోన్ చేశాడు. అతనితో పాటే బయటకు వచ్చిన ఆ మహిళ.. కత్తితో దాడి చేసినట్లు హోటల్ సిబ్బందికి తెలిపింది.
Qassem Soleimani death: రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తులో విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. 2020 నాటి అమెరికన్ డ్రోన్ దాడిలో చనిపోయిన ఇరాన్ మిలిటరీ నాయకుడు ఖాసీం సులేమానీ మృతికి ప్రతికారంగా ఈ ఘటనకు పాల్పడినట్లు నిందితురాలు ఒప్పుకుంది. అయితే.. 'గ్రేవ్.. డిగ్గర్' అనే పాట తను ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రేరణనిచ్చిందని తెలిపింది.
ఇరాన్ అగ్ర కమాండర్ జనరల్ ఖాసీం సులేమానీని 2020లో మట్టుబెట్టింది అగ్రరాజ్యం. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు సులేమానీ నాయకత్వం వహించారు.
ఇదీ చదవండి: బస్సులో మహిళపై అత్యాచారం.. పక్కా స్కెచ్‌తో!