ETV Bharat / international

కొవిడ్​ నుంచి మహిళలకు అధిక రక్షణ.. కారణం ఇదే

కరోనా ముప్పు పురుషుల కంటే మహిళల్లో తక్కువని కెనడా శాస్త్రవేత్తలు తేల్చారు. మహిళల్లో రోగనిరోధక ప్రతిస్పందనను కలిగించే హార్మోన్లు, క్రోమోజోములు ఉండటమే ఇందుకు కారణమని వెల్లడించారు. ఆల్బర్టా విశ్వవిద్యాలయానికి చెందిన గావిన్ క్విడిట్​ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

women are less affected by covid-19 compared to men
కొవిడ్​ నుంచి మహిళలకు అధిక రక్షణ..కారణం ఇదే
author img

By

Published : Dec 19, 2020, 6:48 AM IST

Updated : Dec 19, 2020, 7:16 AM IST

పురుషులతో పోలీస్తే.. కొవిడ్​-19 వల్ల తీవస్థాయి సమస్యలు, మరణం ముప్పు మహిళల్లోనే తక్కువని కెనడా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అతివల్లో బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను కలిగించే హార్మోన్లు, క్రోమోజోములు ఉండటమే ఇందుకు కారణమన్నారు. ఆల్బర్టా విశ్వవిద్యాలయానికి చెందిన గావిన్ క్విడిట్​ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

ఏసీఈ2 అనే ఒక ఎంజైమ్​తో ముడిపడిన లింగపరమైన భేదాలను వారు శోధించారు. నిజానికి ఈ ఎంజైమ్​..మానవ శరీరంలోకి వైరస్ ప్రవేశానికి వీలు కల్పించే ద్వారంలా పనిచేస్తుంది. ఇది గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధుల నుంచి రక్షించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తోంది. ఏసీఈ-2 అనేది 'ఎక్స్​' క్రోమోజోముతో ముడిపడిన జన్యువు. పురుషుల్లో ఈ క్రోమోజోము ఒక్కటే ఉంటుంది. మహిళల్లో రెండు ఉంటాయి. ఈ నేపథ్యంలో మహిళల్లో ఏసీఈ2కు సంబంధించిన జన్యువులు రెండు ఉంటున్నాయి. దీనివల్ల మహిళలకు కొవిడ్​-19 ఇన్​ఫెక్షన్​ ముప్పు పెరగకపోగా.. వైరస్​తో ముడిపడిన రుగ్మతల బారి నుంచి రక్షణ లభిస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పుట్టుకతో వచ్చే రోగనిరోధక వ్యవస్థలో కీలక భాగమైన 'టోల్​-లైక్' రెసెప్టార్ సెవెన్​ అనే భాగం కూడా మహిళల్లో రెట్టింపు స్థాయిలో బలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అందువల్లే అతివలు..వైరస్ ఇన్​ఫెక్షన్​ను మెరుగ్గా ఎదుర్కోగలుగుతున్నారని వివరించారు.

Last Updated : Dec 19, 2020, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.