ETV Bharat / international

బోర్ కొట్టి రూ.2వేలు ఖర్చు చేస్తే.. రూ.7.5 కోట్ల జాక్​పాట్ - 7కోట్ల లాటరీ ఫ్లోరిడా

విమానం రద్దు కావడం ఆ మహిళను కోటీశ్వరురాలిని చేసింది. ఆ సంగతి తెలిస్తే అదృష్టం అంటే ఇలా ఉండాలి అని అనుకుంటారు. ఇంతకీ విమానం రద్దుకు, ఆమె కోటీశ్వరురాలు అవడానికి సంబంధం ఏంటి?

lottery winner florida 51 year women, women lottery ticket florida
బోర్ కొట్టి రూ.2వేలు ఖర్చు చేస్తే.. రూ.7.5 కోట్ల జాక్​పాట్
author img

By

Published : Aug 5, 2021, 5:18 PM IST

Updated : Aug 5, 2021, 9:36 PM IST

అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రం కేన్సస్​కు చెందిన 51 ఏళ్ల ఏంజెలా కార్వేలా.. ఫ్లోరిడాలో విమానం ఎక్కాల్సి ఉంది. ఇంతలో విమానం రద్దు చేస్తున్నట్లు సిబ్బంది ప్రకటించారు. దీంతో చేసేదేమీ లేక బయటకు వచ్చిన కార్వేలా.. సమీపాన ఉన్న ఓ సూపర్​మార్కెట్​లో 30 డాలర్లు (రూ.2,220) పెట్టి లాటరీ టికెట్​ కొనుగోలు చేసింది. అంతే.. ఇక్కడితో ఆమె దశ తిరిగింది. ద ఫాస్టెస్ట్​ రోడ్​ అనే సంస్థ నిర్వహించిన ఈ లాటరీలో కార్వేలా విజేతగా నిలిచింది. ప్రైజ్​మనీగా ఒక మిలియన్​ డాలర్లు (సుమారు రూ.7.5కోట్లు) గెలుచుకుంది.

నేను అప్పుడే అనుకున్నా..

ఈ లాటరీ టికెట్​ గెలుపుతో కార్వేలా ఆనందంలో మునిగితేలుతోంది. తనకు విమానం రద్దు అయినప్పుడే ఏదో వింత అనుభవం ఎదురుకానుందని అనిపించిందని చెప్పుకొచ్చింది. సమయం గడపడం కోసం సరదాగా కొన్న స్క్రాచ్​ ఆఫ్​ టికెట్లతో కోట్లు గెలుచుకున్నానని సంతోషం వ్యక్తం చేసింది. ఈ నగదులో కొంత మొత్తం పన్నులకు పోగా.. 7,90,000 డాలర్లు (రూ.5.8 కోట్లు) కార్వేలా చేతికి అందనున్నాయి.

కార్వేలాకు లాటరీ టికెట్​ విక్రయించిన పబ్లిక్స్​ సూపర్​ మార్కెట్​కు కూడా 2000 డాలర్లు (రూ.1.4 లక్షలు) బోనస్​ కమీషన్​ అందనుంది.

ఇదీ చూడండి : ఈ కోతి సోకులకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్​

Last Updated : Aug 5, 2021, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.