ETV Bharat / international

ట్రంప్‌ నిషేధించినా ఆ వెబ్‌సైట్‌ నడిపిస్తాం! - అమెరికాలో టిక్​టాక్​

అమెరికాలో టిక్​టాక్​ను నిషేధించటంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ సంస్థ అగ్రరాజ్య చీఫ్​ వనెస్సా పప్పాస్​. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తమ యాప్​పై నిషేధం విధించినా ఏదో ఒకదారిలో ప్రజలను అలరిస్తామని తెలిపారు. టిక్​టాక్​పై ఆధారపడ్డ అమెరికన్లను వెబ్​సైట్​ ద్వారా ఆకట్టుకుంటామని చెప్పారు.

will-continue-tik-tok-website
ట్రంప్‌ నిషేధించినా ఆ వెబ్‌సైట్‌ నడిపిస్తాం!
author img

By

Published : Aug 22, 2020, 4:01 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ‌ యాప్‌పై నిషేధం విధించినా ఏదో ఒకదారిలో ప్రజలను అలరిస్తామని టిక్‌టాక్‌ అమెరికా చీఫ్‌ వనెస్సా పప్పాస్‌ అంటున్నారు. టిక్‌టాక్‌పై ఆధారపడ్డ అమెరికన్లను వెబ్‌సైట్‌ ద్వారా ఆకట్టుకుంటామని అన్నట్టు సమాచారం. ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను పోగొట్టేందుకు వారితో మాట్లాడుతున్నామని మీడియాకు చెప్పారు.

"రోజూ లక్షల మంది అమెరికన్లు మా యాప్‌పై ఆధారపడుతున్నారు. వారికి ఈ అద్భుతమైన యాప్‌ అనుభూతిని అందించేందుకు మాకు ఎన్నో దారులు ఉన్నాయని విశ్వసిస్తున్నాం. అమెరికాలో విదేశీ పెట్టుబడుల కమిటీ చేసిన ఆరోపణలపై తమకు ఎలాంటి ఆధారాలు చూపలేదు."

-వనెస్సా పప్పాస్​, టిక్​టాక్​ అమెరికా చీఫ్​

కొనుగోలు ఒప్పందాలపై ప్రశ్నించగా ఆమె సమాధానం దాటవేశారు వనెస్సా. ఉద్యోగులు ఆందోళన చెందకుండా నిత్యం మాట్లాడుతున్నామని పేర్కొన్నారు.

మూడేళ్లు చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధం చేసిన సంగతి తెలిసిందే! ఫలితంగా ప్రపంచంలోని అనేక దేశాలు ఇబ్బందులు పడ్డాయి. కొన్నాళ్ల తర్వాత సమస్యను పరిష్కరించుకొనేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. ట్రంప్‌ దశల వారీగా ఆంక్షలు తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ రావడం, సమాచారాన్ని ఇవ్వకపోవడం, వైరస్‌ను నియంత్రించకపోవడతో డ్రాగన్‌ దేశంపై అందరికీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇదే సమయంలో గల్వాన్‌ లోయలో భారత సైనికులతో బాహాబాహీకి దిగడం దాని గౌరవాన్ని మరింత దిగజార్చింది.

చైనాను దారిలోకి తెచ్చేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ అనేక అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారం బదిలీ అవుతుండటం, చైనా సర్వర్లలో నిక్షిప్తమవ్వడం, దేశ సార్వభౌమత్వానికి ముప్పు ఉండటంతో టిక్‌టాక్‌, హెలో సహా అనేక డ్రాగన్‌ యాప్‌లపై నిషేధం విధించారు. మోదీ బాటలోనే ట్రంప్‌ నడవాలని అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు అధ్యక్షుడికి లేఖ రాశారు. దీనిపై చర్చించిన ఆయన సెప్టెంబర్‌ 15లోపు టిక్‌టాక్‌ యాజమాన్య హక్కులను అమెరికా సంస్థలకు బదిలీ చేయాలని లేదంటే నిషేధం తప్పదని హెచ్చరించారు. అవసరమైతే విశేష అధికారాలను ఉపయోగిస్తానని చెప్పారు. దీంతో మైక్రోసాఫ్ట్‌, ట్విటర్‌ ఆ సంస్థతో చర్చలు జరుపుతున్నాయని వార్తలు వచ్చాయి.

ఇదీ చూడండి: ట్రంప్​ డెడ్​లైన్​: టిక్​టాక్​ ఆస్తులను 90 రోజుల్లోపు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.