భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాకు అత్యవసర అనుమతులు (Covaxin WHO approval) ఇచ్చే విషయంపై డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా మండలి అక్టోబర్ 26న భేటీ కానుంది. టీకాకు అనుమతులపై (Covaxin WHO approval status) సమావేశంలో చర్చించనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఈ ప్రక్రియ (Covaxin WHO news) పూర్తి చేసేందుకు భారత్ బయోటెక్‌తో కలిసి డబ్ల్యూహెచ్ఓ పనిచేస్తోందని వెల్లడించారు.
విస్తృతమైన టీకా పోర్ట్‌ఫోలియో ఉండాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు స్వామినాథన్ (Soumya Swaminathan Covaxin). ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
కొవాగ్జిన్ టీకాకు అత్యవసర అనుమతుల కోసం డబ్ల్యూహెచ్ఓ.. విడతలవారీగా సమాచారం అందిస్తోంది. డబ్ల్యూహెచ్ఓ అభ్యర్థన మేరకు సెప్టెంబర్ 27న అదనపు సమాచారాన్ని పంపించింది. దీన్ని విశ్లేషించి.. టీకా అనుమతులపై డబ్ల్యూహెచ్ఓ నిర్ణయం తీసుకోనుంది.
ఇదీ చదవండి: 'ఆ లెక్కలు తేలాకే చిన్నారుల టీకాకు అనుమతి'